ఫలితం మరోలా: మెక్‌కల్లమ్ క్యాచ్‌కి గేల్ అవుటై ఉంటే (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రాజ్‌కోట్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ లయన్స్ ఆటగాడు బ్రెండన్ మెక్ కల్లమ్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. గుజరాత్ స్సిన్నర్ జడేజా వేసిన 8 ఓవర్లో దూకుడుగా ఆడిన గేల్ చివరి బంతిని గాల్లోకి లేపాడు. దీనిని మెకల్లమ్ బౌండరీ వద్ద అద్బుతంగా డైవ్ చేసి అందుకున్నాడు.

కానీ మెక్‌కల్లమ్ పెట్టుకున్న క్యాప్ గేల్‌ను రక్షించింది. థర్డ్ అంపైర్ రివ్యూలో క్యాప్ బౌండరీకి తగలడంతో గేల్ నాటౌట్‌గా ప్రకటించాడు. అదే సమయంలో దానిని అంఫైర్ సిక్స్‌గా ప్రకటించాడు. రవీంద్ర జడేజా వేసిన ఆ ఓవర్లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో 21 పరుగులు సమర్పించుకున్నాడు. 35 ఏళ్ల బ్రెండన్ మెక్‌కల్లమ్ అందుకున్న అద్భుతమైన క్యాచ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

మ్యాచ్ ఫలితం మరోలా

మ్యాచ్ ఫలితం మరోలా

ఈ క్యాచ్ ద్వారా క్రిస్ గేల్ అవుటై ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. బెంగళూరు ఓపెనర్లు క్రిస్ గేల్ (38 బంతుల్లో 77; 5 ఫోర్లు, 7 సిక్సులు), విరాట్ కోహ్లీ (50 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సు) అర్ధ సెంచరీలతో చెలరేగారు.

38 బంతుల్లో 5 ఫోర్లు 7 సిక్సర్లతో 77 పరుగులు

38 బంతుల్లో 5 ఫోర్లు 7 సిక్సర్లతో 77 పరుగులు

క్రిస్ గేల్ విజృంభించి 38 బంతుల్లో 5 ఫోర్లు 7 సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో టీ20ల్లో పది వేల పరుగులు చేసిన తొలి ఆటగాడిగా వరల్డ్ రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో పదివేల పరుగులు చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. రాజ్‌కోట్ వేదికగా గుజరాత్ లయన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో థంపీ బౌలింగ్‌లో నాలుగో ఓవర్‌ మూడో బంతికి సింగిల్‌ తీసి మూడు పరుగులు సాధించడంతో ఈ ఘనత సాధించాడు.

ఈ మ్యాచ్‌కు ముందు 9,997 పరుగులతో

ఈ మ్యాచ్‌కు ముందు 9,997 పరుగులతో

గుజరాత్ లయన్స్‌తో జరుగుతున్న మ్యాచ్ క్రిస్ గేల్ కెరీర్‌లో 290వ టీ20. ఈ మ్యాచ్‌కు ముందు అతడు 9,997 పరుగులతో ఉన్నాడు. 285 ఇన్నింగ్స్‌లు ఆడిన గేల్ 18 సెంచరీలు, 60 అర్ధ సెంచరీలను సాధించాడు. టీ20 ఫార్మెట్‌లో క్రిస్ గేల్ అత్యధిక స్కోరు 175 నాటౌట్. ఐపీఎల్ పదో సీజన్‌కు ముందు 63 పరుగుల దూరంలో ఉన్న గేల్ ఇప్పటివరకూ ఆడిన మ్యాచ్‌ల్లో ఈ రికార్డుని సాధిస్తాడని అభిమానులు భావించినా అది జరగలేదు.

మంగళవారం క్రిస్ గేల్ రికార్డు

మంగళవారం క్రిస్ గేల్ రికార్డు

ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన 60 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్ ఆరంభ వేడుకల అనంతరం సన్ రైజర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో క్రిస్ గేల్ 32 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో 6 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ జరిగిన మ్యాచ్‌లో 22 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టులోకి రావడంతో రెండు మ్యాచ్‌లకు గేల్ దూరమయ్యాడు. ఇలా ఈ సీజన్‌లో వరుస వైఫల్యాల తర్వాత మంగళవారం క్రిస్ గేల్ ఈ రికార్డుని సాధించాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Gujarat Lions (GL) player Brendon McCullum took a stunning catch of Chris Gayle near the long-off boundary in the 8th over of match 19 in IPL 2017.
Please Wait while comments are loading...