స్పెషల్ ఎట్రాక్షన్: క్రిస్‌ గేల్‌పై విజయ్ మాల్యా ట్వీట్, ఆ పరిస్థితిలో కూడా

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రాజ్‌కోట్ వేదికగా గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఆటగాడు క్రిస్ గేల్ టీ20ల్లో 10వేల పరుగుల మైలురాయిని అందుకున్న సంగతి తెలిసిందే. అరుదైన ఘనత సాధించిన క్రిస్ గేల్‌పై సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తాయి.

అయితే వీటన్నింటిలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మాజీ యజమాని విజయ్‌ మాల్యా చేసిన ప్రశంస స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఎందుకంటే మంగళవారం లండన్‌లో స్కాట్లాండ్‌ యార్డ్ పోలీసులు విజయ్‌ మాల్యా అరెస్ట్‌ చేశారు. అయితే వెంటనే బెయిల్‌పై విడుదలయ్యారు.

క్రిస్ గేల్‌‌కు కంగ్రాట్స్‌ చెప్పిన విజయ్ మాల్యా

దేశమంతా ఈ విషయమై మాట్లాడుకుంటుండగా విజయ్ మాల్యా మాత్రం క్రిస్ గేల్‌‌కు కంగ్రాట్స్‌ చెప్పి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. టీ20ల్లో ప్రపంచ రికార్డు సాధించిన క్రిస్ గేల్‌‌ను యూనివర్సల్‌ బాస్‌‌గా అభివర్ణిస్తూ ట్వీట్‌ చేశారు.

ఆన్‌లైన్‌లో వైరల్‌

విజయ్ మాల్యా ట్వీట్‌ ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారడంతో పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. ‘గేల్‌ సరే.. నీ సంగతేంటి?, గెయిల్‌ను మర్చిపోయి.. బెయిల్‌ గురించి ఆలోచించండి అంటూ మాల్యాపై నెటిజన్లు విమర్శలు కురిపించారు.

ఆర్‌సీబీ విజయాల్లో పాల్గొనకపోయారా?

'బెంగళూరుకు వచ్చి ఆర్‌సీబీ విజయాల్లో పాల్గొనకపోయారా?' అంటూ మాల్యాపై నెటిజన్లు విమర్శలు కురిపించారు.

లండన్‌ పారిపోయిన విజయ్‌ మాల్యా

లండన్‌ పారిపోయిన విజయ్‌ మాల్యా

దేశంలోని పలు బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి లండన్‌ పారిపోయిన విజయ్‌ మాల్యాను స్కాట్లాండ్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన బెయిల్‌ పై విడుదలయ్యారు.. మాల్యా గతంలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఫ్రాంఛైజీకి యజమానిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Chris Gayle's knock for Royal Challengers Bangalore (RCB) against Gujarat Lions (GL) in the Indian premier League (IPL) on Tuesday, which also was a landmark for him as he crossed 10,000 Twenty20 runs, was big enough for Vijay Mallya to find time from his legal wrangles and tweet a congratulatory message for the West Indian.
Please Wait while comments are loading...