ఇది ప్రత్యేకమైన సమయం: చిన్నారులతో కోహ్లీ (ఫోటోలు)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐపీఎల్‌ మ్యాచ్‌లతో నిత్యం బిజీగా ఉండే క్రికెటర్లు ఏమాత్రం సమయం దొరికినా అభిమానులకు మరితం దగ్గరవుతున్నారు. కొద్ది రోజుల క్రితం బెంగళూరులోని శునకాల చికిత్స కేంద్రాన్ని సందర్శించి కుక్క పిల్లలపై ఉన్న తన ప్రేమను చాటుకున్న విరాట్ కోహ్లీ గురువారం దివ్యాంగులైన చిన్నారులను కాసేపు గడిపాడు.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు  | ఐపీఎల్ పాయింట్ల పట్టిక  | ఐపీఎల్ 2017 ఫోటోలు

తామహర్‌లోని దివ్యాంగులైన చిన్న పిల్లల ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని సహచర ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్, షేన్ వాట్సన్‌లతో కలిసి సందర్శించాడు. రాజ్‌కోట్‌లో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ లయన్స్‌పై విజయం సాధించిన బెంగళూరు ఆటగాళ్లకు కాస్త విరామం లభించింది. ఏప్రిల్‌ 23న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో బెంగళూరు తలపడనుంది.

దీంతో తదుపరి మ్యాచ్‌కి విరామం లభించడంతో ఆటగాళ్లు తిరిగి బెంగళూరు చేరుకున్నారు. ఈ క్రమంలో కోహ్లీ గురువారం ఉదయం కోహ్లీతో పాటు డివిలియర్స్‌, షేన్‌ వాట్సన్‌ కూడా చిన్నారులతో కలిసి సందడి చేశారు. వీరందరూ చిన్నారులతో గడిపిన ఓ ఫొటోను కోహ్లీ సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

IPL 2017: Virat Kohli Takes A Break to Meet Specially Abled Children

అనంతరం కోహ్లీ 'తమహార్‌లో ప్రత్యేక అవసరాలు గల చిన్నారులను కలిశాను. నాతో పాటు డివిలియర్స్‌, షేన్‌ వాట్సన్‌ కూడా ఉన్నారు. ఈ చిన్నారులను కలవడం ఎంతో ఆనందంగా ఉంది. వారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. జీవితంలో ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు ఎప్పటికి గుర్తుండిపోతాయి' అని పేర్కొన్నాడు.

ఫోటోలు: తలపై ప్రేమగా నిమురుతూ కెప్టెన్ కోహ్లీ

ముఖ్యంగా చిన్న పిల్లల సంరక్షణ కోసం ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తూ ప్రమోట్ చేస్తున్నాడు. 'ఇది ప్రత్యేకమైన సమయమని, జీవితంలో చిన్న విషయాలకు సంతోషంగా ఎలా ఉండాలో వీరి నుంచి నేర్చుకున్నామని' ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోస్ట్ చేశాడు. చిన్నపిల్లల కోసం కోహ్లీ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Indian Premier League is as much about cricket as it is about bringing the fans closer to their idols and Indian cricket’s poster boy Virat Kohli took time out on Thursday morning to spend some time with specially abled children at Tamahar. And he had for company none other than RCB teammates AB de Villiers and Shane Watson. The IPL is one of the most hectic domestic tournaments in the world, thanks to the non-stop travelling, but Kohli always has time for his special fans.
Please Wait while comments are loading...