ఐపీఎల్: ఎక్కువ సిక్సులు ఏ మ్యాచ్‌లో బాదారో తెలుసా?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తొమ్మిది సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్‌లోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా గత సీజన్లలో ఆటగాళ్లు సాధించిన రికార్డులతో పాటు బద్దలైన రికార్డులను పాఠకులు కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం.

క్యాష్ రిచ్ టోర్నీగా పేరుగాంచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటేనే బౌండరీలు, సిక్సర్లకు పెట్టింది పేరు. ఆటగాళ్లు సైతం అభిమానులను ఉత్సాహాపరిచేందుకు స్టేడియం పైకప్పులను బంతులు తాకేలా ఆడుతుంటారు. ఏప్రిల్‌ 18, 2017 నాటికి ఐపీఎల్‌లో ఏయే మ్యాచుల్లో అత్యధిక సిక్సర్లు నమోదయ్యాయో ఒక్కసారి చూద్దాం.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ Vs రాజస్థాన్‌ రాయల్స్‌

చెన్నై సూపర్‌ కింగ్స్‌ Vs రాజస్థాన్‌ రాయల్స్‌

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యధిక సిక్సర్లు చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో నమోదయ్యాయి. 2010లో జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లకు చెందిన బ్యాట్స్‌మెన్‌ ఏకంగా 30 సిక్సర్లు బాదారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 246 పరుగులు చేయగా, రాజస్ధాన్ రాయల్స్ 223 పరుగులు చేసింది.

చెన్నై సూపర్‌ కింగ్స్‌ Vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్

చెన్నై సూపర్‌ కింగ్స్‌ Vs కింగ్స్ ఎలెవన్ పంజాబ్

2008లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ , కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో, 2017 గుజరాత్‌ లయన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్‌లో 25 సిక్సర్లు బాదారు. 2008లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 240 పరుగులు చేయగా, పంజాబ్ 207 పరగులు చేసి పరాజయం పాలైంది.

బెంగళూరు Vs సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

బెంగళూరు Vs సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

గతేడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య జరిగిన ఫైనల్లో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు 23 సిక్సర్లు బాదారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 10 సిక్సర్లతో 208 పరుగులు చేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన బెంగళూరు 13 సిక్సర్లతో 200 పరుగులు చేసిన పరాజయం పాలైంది.

బెంగళూరుపై సిక్సర్ల వర్షం

బెంగళూరుపై సిక్సర్ల వర్షం

బెంగళూరు జట్టులో విధ్వంసకర బ్యాట్స్ మెన్ ఉన్నప్పటికీ, సరైన బౌలర్లు లేకపోవడంతో ఆ జట్టుపై ప్రత్యర్ధి జట్లు సిక్సుల మీద సిక్సులు కొడుతున్నాయి. ధర్మశాలలో 2011లో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ బ్యాట్స్‌మెన్‌ 15 సిక్సర్లు బాదారు. బెంగళూరులో 2008లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌, 2017 రాజ్‌కోట్‌లో గుజరాత్‌ లయన్స్‌ 14 సిక్సర్లు బాదగా, 2010లో ఆర్‌సీబీపై చెన్నైలో సూపర్‌ కింగ్స్‌ 13 సిక్సర్లు బాదింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In Indian premier League highest sixes in a ipl match by Chennai Super Kings Vs Rajasthan Royals held at Chennai.
Please Wait while comments are loading...