ప్లేఆఫ్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే ఉండాలి: కోల్‌కతా గెలుపుపై షారుక్ అసంతృప్తి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా బుధవారం జరిగిన సన్‌‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్ల మధ్య జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌పై కోల్‌‌కతా ప్రాంఛైజీ సహా యజమాని, బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు

మరికొన్ని నిమిషాలు వర్షం పడితే మ్యాచ్‌ రద్దు అయి సన్‌‌రైజర్స్‌ విజేతగా నిలిచేదని, ప్లే ఆఫ్స్‌ (ఎలిమినేటర్‌) మ్యాచ్‌లకు రిజర్వ్‌ డే లేకపోడవంపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఇక సన్‌రైజర్స్‌పై కోల్‌కతా విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ట్విట్టర్‌లో పోస్టు పెట్టాడు.

IPL Play-offs need to have a reserve day: KKR owner Shah Rukh Khan

ఐపీఎల్‌లో ఎంతో ముఖ్యమైన ప్లే ఆఫ్స్‌‌లో జరిగే మ్యాచ్‌లు ఏదైనా కారణంగా రద్దయితే రిజర్వ్‌ డే (మరొక రోజు) ఉండాలని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ గౌతం గంభీర్ సన్ రైజర్స్‌ని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 128 పరుగులు చేసింది. సన్ రైజర్స్ ఇన్నింగ్స్‌ ముగిశాక వర్షం కారణంగా ఆటకు మూడున్నర గంటలు అంతరాయం కలిగింది.

ఆ తర్వాత డక్‌వర్త్‌ లూయిస్ పద్ధతి ప్రకారం కోల్‌కతా లక్ష్యాన్ని ఆరు ఓవర్లలో 48 పరుగులుగా నిర్దేశించారు. దీంతో ఆ లక్ష్యాన్ని కోల్‌కతా 5.2 ఓవర్లలోమూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 'ఫస్ట్‌ బ్యాటింగ్‌ చేసిన సన్‌ రైజర్స్‌ను కేవలం 128 పరుగులకే మా బౌలర్లు కట్టడిచేశారు. వర్షం రాకపోయినా కోల్‌కతా విజయం సాధించేది' అని షారుక్ అన్నాడు.

ఎలిమినేటర్ హైలెట్స్: రికార్డు సృష్టించిన వార్నర్, డక్‌వర్త్‌-లూయిస్‌‌లో కోల్‌కతా విజయం

'సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ ముగిసిన వెంటనే వర్షం అడ్డంకిగా మారడంతో మ్యాచ్‌ను దాదాపు మూడు గంటలపాటు నిలిపివేశారు. ఓ దశలో కోల్‌ కతా జట్టు బ్యాటింగ్‌ చేయదని, అలాంటి సందర్భంలో లీగ్‌ దశలో మెరుగైన పాయింట్లు సాధించిన సన్‌రైజర్స్‌ను విజేతగా ప్రకటిస్తారని ముంబై ఇండియన్స్‌తో రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌ ఆడతుందని కథనాలు రావడం బాధించిందని' షారుక్ చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉంటే ఎలిమినేటర్ మ్యాచ్ జరిగిన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలోనే క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ శుక్రవారం తలపడనుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Kolkata Knight Riders (KKR) co-owner and Bollywood superstar Shah Rukh Khan on Thursday expressed his displeasure at the Indian Premier League (IPL) play-offs not having a reserve day in case of a washout.
Please Wait while comments are loading...