అరుదైన ఘనత: జహీర్ ఖాన్ రికార్డుని బద్దలు కొట్టిన జడేజా

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వికెట్లను సాధించిన బౌలర్ల జాబితాలో అగ్రస్ధానంలో నిలిచాడు. గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో సెమీ ఫైనల్లో ఒక వికెట్ తీయడం ద్వారా భారత్ తరపున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్  | ఫోటోలు  | స్కోరు కార్డు 

ఈ క్రమంలో టీమిండియా మాజీ బౌలర్ జహీర్ ఖాన్ రికార్డుని రవీంద్ర జడేజా బద్దలు కొట్టాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటివరకూ తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన జడేజా 16 వికెట్లు తీశాడు. దాంతో ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన జహీర్ 15 వికెట్ల రికార్డును జడేజా అధిగమించాడు.

Ravindra Jadeja overtakes Zaheer Khan to become India’s leading wicket-taker in Champions Trophy

ఆ తర్వాతి స్ధానాల్లో హర్భజన్ సింగ్(14), సచిన్ టెండూల్కర్(14), ఇషాంత్ శర్మ(13), భువనేశ్వర్ కుమార్ (12) వికెట్లు తీసిన వారిలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఖాతాలో మరో రికార్డు చేరింది. ఈ టోర్నీలో 11 నుంచి 40 ఓవర్ల మధ్యలో అత్యధిక వికెట్లను సాధించిన జట్టుగా భారత్ నిలిచింది.

ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో 11 నుంచి 40 ఓవర్ల మధ్య టీమిండియా 19 వికెట్లు తీసి అగ్రస్ధానంలో నిలిచింది. అంతకుముందు పాకిస్తాన్ పేరిట ఉన్న రికార్డును భారత్ అధిగమించింది. 18 వికెట్లతో పాకిస్థాన్ రెండో స్ధానంలో నిలిచింది.

ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు:

ప్లేయర్ మ్యాచ్‌లు వికెట్లు
రవీంద్ర జడేజా 9 16
జహీర్ ఖాన్ 9 15
హర్భజన్ సింగ్ 13 14
సచిన్ టెండూల్కర్ 16 14
ఇషాంత్ శర్మ 7 13

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ravindra Jadeja continues his love-affair with ICC Champions Trophy. The spinner, after a brilliant run in the 2013 edition, has now surpassed Zaheer Khan’s tally of 15 in the tournament. He is now India’s leading wicket-taker in the tournament’s history.
Please Wait while comments are loading...