ఢిల్లీకి ఊహించని దెబ్బ: ఐపీఎల్ 10కి జెపి డుమిని దూరం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 10వ ఎడిషన్‌‌లో పాల్గొనడం లేదని దక్షిణాఫ్రికా ఆటగాడు జెపి డుమిని స్పష్టం చేశాడు. వ్యక్తిగత కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌లో జెపి డుమిని ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు తరుపున ఆడుతున్నాడు.

కాగా, ఐపీఎల్ 10వ సీజన్‌కు ఇంక కొన్ని రోజులే మిగులున్నాయి. ఏప్రిల్‌ 5న హైదరాబాద్‌లోని ఉప్పల్‌‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఐపీఎల్‌ ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. ఆ తర్వాత డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.

ఇదే స్టేడియంలో మే 21న ఐపీఎల్ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. దేశవ్యాప్తంగా 10 వేదికల్లో 47 రోజులపాటు మొత్తం 60 మ్యాచ్‌లను నిర్వహించనున్నట్లు బీసీసీఐ తెలిపింది. ప్రతి జట్టు 14 మ్యాచ్‌లను ఇతర జట్లతో ఆడాల్సి ఉంటుంది. ఐపీఎల్ 10వ ఎడిషన్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ 26 మంది ఆటగాళ్లతో బరిలోకి దిగుతుంది. జట్టులో మొత్తం 9 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.

జట్టులో మొత్తం ఆటగాళ్లు - 26, విదేశీ ఆటగాళ్లు - 9, మిగిలిన సొమ్ము - రూ. 9.5 కోట్లు
1. జెపి డుమినీ (దక్షిణాఫ్రికా)
2. క్వింటన్ డి కాక్ (దక్షిణాఫ్రికా)
3. సామ్ బిలింగ్స్ (ఇంగ్లాండ్)
4. క్రిస్టోఫర్ మోరిస్ (దక్షిణాఫ్రికా)
5. కార్లోస్ బ్రాత్ వైట్ (వెస్టిండిస్)
6. మహమ్మద్ షామీ
7. షాబాజ్ నదీమ్
8. జయంత్ యాదవ్
9. అమిత్ మిశ్రా
10. శ్రేయాస్ అయ్యర్
11. జహీర్ ఖాన్
12. సంజు శాంసన్
13. కరుణ్ నాయర్
14. రిషబ్ పంత్
15. సివి మిలింద్
16. సయ్యద్ ఖలీల్ అహ్మద్
17. ప్రత్యూష్ సింగ్

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Delhi Daredevils all-rounder Jean-Paul Duminy withdraws from the upcoming edition of IPL due to personal reasons.
Please Wait while comments are loading...