మూడో టెస్టు: అరుదైన రికార్డు నెలకొల్పిన కేఎల్ రాహుల్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: పల్లెకెలె వేదికగా ఆతిథ్య శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ రికార్డు సృష్టించాడు. టెస్టు క్రికెట్‌లో వరుసగా ఏడు హాఫ్ సెంచరీలు చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా అరుదైన గుర్తింపు పొందాడు.

ఆతిథ్య శ్రీలంకతో పల్లెకెలె వేదికగా జరుగుతున్న మూడో టెస్టు తొలి రోజున కేఎల్ రాహుల్ ఈ ఘనత సాధించాడు. ఇన్నింగ్స్ 19.4వ ఓవర్లో లాహిరు కుమారా బౌలింగ్‌లో ఓపెనర్‌ రాహుల్‌ కూడా 50 పరుగులు పూర్తి చేసి రాహుల్ ద్రవిడ్, జీఆర్ విశ్వనాథ్‌ల రికార్డుని అధిగమించాడు.

KL Rahul becomes first Indian to score seven Test fifties in a row

టెస్టు క్రికెట్‌ చరిత్రలో మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, జీఆర్ విశ్వనాథ్‌లు వరుసగా ఆరు హాఫ్ సెంచరీలు సాధించగా... సునీల్ గవాస్కర్, దిలిప్ వెంగ్ సర్కార్, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, సంజయ్ మంజ్రేకర్‌లు వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు చేశారు.

గ‌తంలో టెస్టుల్లో వరుసగా టెస్టుల్లో ఏడు హాఫ్ సెంచ‌రీలు చేసిన వారిలో ఈడీ వీక్స్‌, ఆండీ ఫ్ల‌వ‌ర్‌, చంద‌ర్‌పాల్‌, సంగక్క‌ర‌, రోజ‌ర్స్ ఉన్నారు. ఇక కేఎల్ రాహుల్ వ‌రుస ఇన్నింగ్స్‌లో 90, 51, 67, 60, 51, 50 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే టెస్టుల్లో వరుసగా అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన రికార్డు దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ (12) పేరిట ఉంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Opener KL Rahul became the first Indian batsman to score fifties in seven successive innings in Test cricket. He achieved the feat on the first day of the third Test against Sri Lanka at Kandy on Saturday (August 12).
Please Wait while comments are loading...