ఆరు అర్ధసెంచరీలు: ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ సరికొత్త రికార్డు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ సిరిస్‌లో చివరిదైన ధర్మశాల టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు అర్ధసెంచరీలు చేశాడు. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 60 పరుగులు చేసిన రాహుల్, రెండో ఇన్నింగ్స్‌లో 51 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

వాళ్లు నా ఫ్రెండ్స్ కారు: ఆస్ట్రేలియన్లతో స్నేహం ముగిసిందన్న కోహ్లీ

ధర్మశాల టెస్టులో టీమిండియా విజయంలో కేఎల్ రాహుల్ కీలకపాత్ర పోషించాడు. అంతేకాదు ఈ సిరిస్‌లో ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ ఆరు అర్ధసెంచరీలు చేశాడు. మొత్తం ఏడు ఇన్నింగ్స్‌లాడిన రాహుల్ వరుసగా 64, 10, 90, 51, 67, 60, 51 అర్ధ సెంచరీలను నమోదు చేశాడు.

kl rahul creates most 50 plus scores as indian opener against australia

దీంతో ఆస్ట్రేలియాపై ఒక సిరీస్‌లో యాభైకి పైగా పరుగుల్ని అత్యధిక సార్లు సాధించిన తొలి భారత ఓపెనర్‌గా రాహుల్ సరికొత్త రికార్డు సృష్టించాడు. అదే సమయంలో మరో ఓపెనర్ మురళీ విజయ్ రికార్డుని సైతం అధిగమించాడు. 2014-15 సీజన్‌లో మురళీ విజయ్ భారత ఓపెనర్‌గా ఐదు సార్లు 50కి పైగా పరుగుల్ని సాధించి రికార్డు సృష్టించాడు.

ధర్మశాల టెస్టులో భారత్ విజయం: 2-1తో టెస్టు సిరిస్ కైవసం

ఆసీస్‌‌తో ముగిసిన చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రాహుల్ అర్ధసెంచరీ చేయడంతో మురళీ విజయ్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో 51 పరుగులతో అర్ధసెంచరీని చేసి సరికొత్త రికార్డుని నెలకొల్పాడు. ధర్మశాల టెస్టులో కేఎల్ రాహుల్ రాణించడంతో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

106 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 23.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 2-1 తేడాతో భారత్ దక్కించుకుంది. మరోవైపు స్వదేశంలో వరుసగా ఏడు టెస్టు సిరిస్‌లను టీమిండియా కైవసం చేసుకుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Opner kl rahul creates most 50 plus scores as indian opener against australia.
Please Wait while comments are loading...