రాంచీ టెస్టులో కోహ్లీకి గాయం: మైదానాన్ని వీడిన కెప్టెన్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రాంచీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో భుజం నొప్పి కారణంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పెవిలియన్‌కు చేరాడు. అతని స్ధానంలో అభినవ్ ముకుంద్ ఫీల్డింగ్‌కు వచ్చాడు. ఇన్నింగ్స్ 40వ ఓవర్‌లో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా బౌలింగ్‌కు వచ్చాడు.

కోహ్లీ డైవ్

కోహ్లీ డైవ్

జడేజా విసిరిన తొలి బంతిని బౌండరీగా తరలించేందుకు ఆసీస్ బ్యాట్స్‌మెన్ పీటర్ హ్యాండ్స్ కోంబ్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో బౌండరీ లైన్‌కు దగ్గరగా వెళ్తున్న బంతిని కోహ్లీ అమాంతం డైవ్ వేసి అడ్డుకున్నాడు.

బౌండర్ లైన్ వద్ద పల్టీ కొట్టిన కోహ్లీ

బౌండర్ లైన్ వద్ద పల్టీ కొట్టిన కోహ్లీ

ఈ క్రమంలో బౌండర్ లైన్ వద్ద కెప్టెన్ కోహ్లీ పల్టీ కొట్టాడు. కోహ్లీ కుడి భుజం గ్రౌండ్‌ను తాకుదూ దూసుకుపోయింది. అనంతరం వెంటనే పైకి లేచిన కోహ్లీ తన భుజాన్ని పట్టుకుని ఇబ్బంది పడుతూ కనిపించాడు.

విశ్రాంతి తీసుకోవాలని ఫిజియో

విశ్రాంతి తీసుకోవాలని ఫిజియో

వెంటనే మైదానంలోకి వచ్చిన ఫిజియో కోహ్లీకి విశ్రాంతి తీసుకోవాలని సూచించాడు. దీంతో కోహ్లీ పెవిలియన్‌కు చేరాడు. తాత్కాలిక కెప్టెన్‌ బాధ్యతలను వైస్‌ కెప్టెన్‌ రహానే తీసుకున్నాడు.

కెప్టెన్ స్మిత్ అర్ధసెంచరీ

కెప్టెన్ స్మిత్ అర్ధసెంచరీ

రాంచీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ స్మిత్ అర్ధసెంచరీ చేసిన వెంటనే ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో హ్యాండ్స్ కోంబ్ ఎల్బీగా వెనుదిరిగాడు. హ్యాండ్స్ కోంబ్ అవుటైన తర్వాత మ్యాక్స్‌వెల్ క్రీజులోకి వచ్చాడు. దీంతో 44 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ 4 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. ప్రస్తుతం స్మిత్ 52, మ్యాక్స్ వెల్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India captain Virat Kohli left the field clutching his shoulder midway through the opening day of the third Test in Ranchi.
Please Wait while comments are loading...