సోషల్ మీడియాకు దూరంగా ఉండటంపై కోహ్లీ స్పందన (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాక్‌తో జరిగే ఫైనల్‌కి ముందు సోషల్ మీడియాకి దూరంగా ఉన్నట్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు

'పాక్‌తో ఫైనల్‌కి ముందు సోషల్‌ మీడియాకి దూరంగా ఉంటున్నాను. ఎందుకంటే పలువురు సోషల్‌మీడియాలో ఇష్టమొచ్చిన రీతిలో స్పందిస్తూ ఉంటారు. ఏవేవో సలహాలు, సూచనలు ఇస్తారు. ఆటగాళ్లపై విమర్శలు చేస్తారు. ఈ పరిస్థితుల్లో వాటిని పట్టించుకోకుండా వీలైనంత దూరంగా ఉండేందుకే ప్రయత్నిస్తాను' అని కోహ్లీ అన్నాడు.

ఆటపై దృష్టి పెడతామని, జట్టుని విజయం దిశగా నడిపిస్తానని కోహ్లీ తెలిపాడు. పాక్‌తో మ్యాచ్‌ సందర్భంగా కోహ్లీ ఏమని ట్వీట్‌ చేస్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసిన సంగతి తెలిసిందే. అయితే గత నాలుగు రోజుల నుంచి కోహ్లీ తన ట్విటర్‌‌లో ఎలాంటి ట్వీట్స్ చేయలేదు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India skipper Virat Kohli admitted Saturday that he is steering clear of social media ahead of Sunday’s high-profile Champions Trophy final against bitter rivals Pakistan.
Please Wait while comments are loading...