వర్షం కోసం పూజలు నిర్వహిస్తున్నావా: లక్ష్మణ్‌ను ఆటపట్టించిన సెహ్వాగ్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మెంటార్‌గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ గురించి ట్విటర్‌‌లో ట్వీట్ చేశాడు. బుధవారం బెంగళూరు వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌-కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య ఎలిమినేటర్‌ మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు  | ఐపీఎల్ పాయింట్ల పట్టిక  | ఐపీఎల్ 2017 ఫోటోలు 

బుధవారం సాయంత్రం నుంచి బెంగళూరులో వర్షం కురుస్తుండటంతో ఈ మ్యాచ్‌ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఐపీఎల్ పదో సీజన్‌లో ఎలిమినేటర్ మ్యాచ్‌కి ఎలాంటి రిజర్వ్ డే లేదు. కాబట్టి.. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే లీగ్ దశలో మెరుగైన ప్రదర్శన చేసిన జట్టు క్వాలిఫయర్‌-2కి చేరుతుందని నిర్వాహకులు వెల్లడించారు.

Laxman ji spotted praying for torrential rains: Sehwag

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 128 పరుగులు చేసింది. సన్ రైజర్స్ ఇన్నింగ్స్‌ ముగిశాక వర్షం కారణంగా ఆటకు మూడున్నర గంటలు అంతరాయం కలిగింది. ఆ తర్వాత డక్‌వర్త్‌ ప్రకారం కోల్‌కతా లక్ష్యాన్ని ఆరు ఓవర్లలో 48 పరుగులుగా నిర్దేశించారు.

దీంతో చివరికి డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం మ్యాచ్‌ నిర్వహించడంతో కోల్‌కతా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇదిలా ఉండగా కొద్ది రోజులక్రితం వీవీఎస్‌ లక్ష్మణ్‌ కుటుంబసభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించాడు.

ఎలిమినేటర్ హైలెట్స్: రికార్డు సృష్టించిన వార్నర్, డక్‌వర్త్‌-లూయిస్‌‌లో కోల్‌కతా విజయం

ఈ ఫోటోలను సెహ్వాగ్‌ ట్వీట్‌ చేసి బెంగళూరులో కుండపోత వర్షం కోసం పూజలు నిర్వహిస్తున్నావా లక్ష్మణ్‌? కానీ, మాకు మ్యాచ్‌ జరగడం కావాలి అని సరదాగా వ్యాఖ్యానించాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈ ఫోటోలు సోషల్ మీడియాల్ హల్ చల్ చేశాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
After rain interrupted the IPL 2017 Eliminator match between Kolkata Knight Riders and Sunrisers Hyderabad, Virender Sehwag posted a picture of SRH mentor VVS Laxman and tweeted, "Laxman ji spotted praying for torrential rains in Bangalore.
Please Wait while comments are loading...