ఆమే ఆదర్శం: మిథాలీలాగే డ్రెస్ వేసుకున్న చిన్నారి (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: లండన్ వేదికగా ఇటీవల జరిగిన ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్‌లో టీమిండియాను ఫైనల్‌కు చేర్చి కెప్టెన్ మిథాలీ రాజ్ అభిమానుల మనసు గెలుచుకున్న సంగతి తెలిసిందే. మిథాలీలాగే డ్రెస్ వేసుకున్న ఓ చిన్నారిని ఆమె ట్విట్టర్‌లో ఆశీర్వదించింది.

వివరాల్లోకి వెళితే ఇష్టమైన జాతీయ నాయకుల దుస్తులు ధరించాలి అనే స్కూల్‌ అసైన్‌మెంట్‌లో భాగంగా గురువారం గుజరాత్‌‌కు చెందిన ఓ చిన్నారి మిథాలీ జెర్సీ ధరించి 'నేను మిథాలీ రాజ్‌ భారత మహిళల క్రికెట్‌ కెప్టన్‌ను' అని తెలిపింది.

దీనికి సంబంధించిన వీడియోని చిన్నారి తండ్రి 'స్కూల్ ఈవెంట్‌లో జాతీయ లీడర్ మాదిరి డ్రెస్ వేసుకుంది. మాకిష్టమైన టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ఆమె నాకూతురికి ఆదర్శం' అని ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.

ఈ ట్వీట్‌కు మిథాలీ రాజ్‌ స్పందించింది. 'చిట్టి తల్లి తన జీవిత లక్ష్యాలన్ని సాధించాలని కోరుకుంటూ' అని ఆశీర్వదిస్తూ రీట్వీట్ చేసింది. లండన్‌లో జరిగిన ఉమెన్ వరల్డ్ కప్‌లో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా మిథాలీ రాజ్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.

దీంతో పాటు వరుసగా ఏడు హాఫ్ సెంచరీలు చేసిన తొలి బ్యాట్స్‌ ఉమెన్‌ కూడా మిథాలీనే కావడం విశేషం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Indian women's cricket icon and team captain Mithali Raj created many waves during the recently-concluded ICC Women's World Cup in the United Kingdom. Though the Indian stars fell agonisingly short of lifting the trophy for the first time, the whole country showered praise on the team.
Please Wait while comments are loading...