న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విమర్శలు: జింబాబ్వేను మాన్కడింగ్ చేసిన విండీస్

చిట్టగాంగ్: అండర్-19 ప్రపంచ కప్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా మంగళవారం వెస్టిండీస్, జింబాబ్వే జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మన్కడింగ్ వివాదం తలెత్తింది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో మన్కడింగ్ యాంటీ క్లైమాక్స్‌గా నిలిచింది.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 226 పరుగులు సాధించి, క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. షమార్ స్ప్రింగర్ 61 పరుగులతో రాణించగా, జింబాబ్వే బౌలర్ రుగారే మగారిరా 28 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే చివరి ఓవర్ మొదలయ్యే సమయానికి తొమ్మిది వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. విజయానికి మరో మూడు పరుగులు మాత్రమే చేయాల్సిన స్థితిలో ఉన్న జింబాబ్వే గెలుపు ఖాయంగా కనిపించింది.

అయితే, ఆ ఓవర్ మొదటి బంతిని వేయడానికి సిద్ధమైన కీమో పాల్ రనప్‌ను మొదలు పెట్టిన తర్వాత నాన్‌స్ట్రయికింగ్ ఎండ్ బ్యాట్స్‌మన్ రిచర్డ్ గరావా క్రీజ్‌ను వదలి ముందుకు వెళ్లడాన్ని గమనించాడు. వెంటనే బంతితో బెయిల్స్‌ను తొలగించాడు.

నిబంధనల ప్రకారం గరావా రనౌటైనట్టు థర్డ్ అంపైర్ ప్రకటించడంతో మన్కడింగ్ చోటు చేసుకున్న ఈ మ్యాచ్‌ని విండీస్ రెండు పరుగుల తేడాతో గెల్చుకుంది. కాగా, విండీస్ ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారని జింబాబ్వే క్రికెటర్లు, అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానుల నుంచి కూడా విండీస్ ఆటతీరుపై మండిపడ్డారు.

mankading incident in West Indies-Zimbabwe U-19 World Cup match

మన్కడింగ్‌ అంటే:

బౌలర్ బంతి వేయడానికి ముందే నాన్‌స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ ఒకవేళ క్రీజ్ నుంచి బయటకు వస్తే, సదరు బౌలర్ బంతితో వికెట్లను కొట్టడాన్ని 'మన్కడింగ్' అంటారు. భారత జట్టు 1947-48లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. సిడ్నీ టెస్టులో ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ బిల్‌ బ్రౌన్‌ను వినూ మన్కడ్‌ ఇలాగే రనౌట్‌ చేశాడు. బంతిని విడుదల చేసే క్రమంలో, బ్రౌన్‌ క్రీజులో బయట ఉండడం చూసి బెయిల్స్‌ను గిరాటేశాడు.

అప్పటి నుంచి అలా ఔట్‌ చేయడాన్ని మన్కడింగ్‌ అంటున్నారు. మన్కడ్‌ క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడంటూ అప్పట్లో ఆస్ట్రేలియా మీడియా దుమ్మెత్తి పోసింది. అంతకుముందు కూడా అలాంటి ఘటనలు జరిగినా మన్కడ్‌ కారణంగా ఆ రనౌట్‌ బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది.

నిబంధనలు:

నిబంధనల ప్రకారం అది ఔటే. 2011లో ఐసీసీ ప్రవేశపెట్టిన ఆట నిబంధనల ప్రకారం.. బౌలర్‌ బంతిని విడుదల చేసే ముందు ఇలా ఔట్‌ కోసం ప్రయత్నించవచ్చు. ఐతే అతడు డెలివరీ స్వింగ్‌ పూర్తి చేసి ఉండకూడదు. క్రికెట్‌ చట్టాలను పర్యవేక్షించే ఎంసీసీ మాత్రం.. డెలివరీ వేయడానికి అవసరమైన అడుగు వేసే ముందే వికెట్లను పడగొట్టచ్చని చెబుతోంది.

అయితే, నిబంధనల ప్రకారం మన్కడింగ్‌ సమ్మతమే. కానీ మన్కడ్‌లా రనౌట్‌ చేయడానికి ముందు ఒక్కసారైనా బౌలర్‌.. బ్యాట్స్‌మన్‌ను హెచ్చరించాలన్నది క్రికెట్లో అలిఖిత నిబంధన.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X