రాంచీ టెస్టు: 119 ఏళ్ల ఆసీస్ రికార్డుని బద్దలు కొట్టిన రెన్ షా

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రాంచీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ మ్యాట్ రెన్ షా అరుదైన రికార్డు నెలకొల్పాడు. 21 ఏళ్ల వయసు నిండకుండానే టెస్టుల్లో 500 పరుగులు సాధించిన తొలి ఆస్ట్రేలియన్ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.

తద్వారా 119 ఏళ్ల ఆస్ట్రేలియా రికార్డుని బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్స్‌కు చెందిన రెన్ షా తన 11వ టెస్టు ఇన్నింగ్స్‌లో 500 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. దీంతో హిల్, ఫిలిప్ హ్యూస్, డాన్ బ్రాడ్ మన్, డగ్ వాల్టర్స్, స్టాన్ మెక్‌కేబీలను అధిగమించాడు.

ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్ అయిన రెన్ షా మార్చి 27వ తేదీన తన 21వ పుట్టినరోజుని జరుపుకోనున్నాడు. ప్రస్తుతం రాంచీలో జరుగుతున్న మూడో టెస్టులో ఓపెనర్ రెన్ షా 44 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

రాంచీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 44 పరుగులు

22.3వ ఓవర్లో ఉమేశ్‌ యాదవ్‌ వేసిన బంతిని ఎదుర్కొన్న రెన్‌షా (44) కోహ్లికి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 69 బంతులు ఎదుర్కొన్న రెన్‌ షా ఏడు ఫోర్ల సాయంతో 44 పరుగులు సాధించాడు. రాంచీ టెస్టు తొలి ఇన్నింగ్స్ పరుగులను జత చేయగా రెన్ షా ప్రస్తుతం 523 పరుగులు చేశాడు.

పాకిస్థాన్‌పై టెస్టుల్లో అరంగేట్రం

గతేడాది నవంబర్‌లో పాకిస్థాన్‌పై పీటర్ హ్యాండ్స్ కోంబ్, నిక్ మాడిన్సన్‌లతో పాటు రెన్ షా కూడా అడిలైడ్ ఓవెల్ టెస్టులో అరంగేట్రం చేశాడు. ఈ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 137 బంతులను ఎదుర్కొన్న రెన్ షా 34 పరుగులు చేసి ఆసీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.

సిడ్నీలో తొలి టెస్టు సెంచరీ

సిడ్నీలో తొలి టెస్టు సెంచరీ

ఆ తర్వాత జరిగిన మెల్ బోర్న్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 71 పరుగులు నమోదు చేశాడు. అనంతరం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టులో 184 పరుగులు చేసి తొలి టెస్టు సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉంటే రాంచీ టెస్టులో ఆస్ట్రేలియా లంచ్ విరామానికి 3 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది.

రాంచీ టెస్టులో లంచ్ విరామానికి ఆసీస్ 109/3


23వ ఓవర్లో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌ వెంటనే 26వ ఓవర్లో మరో కీలక వికెట్‌ను కోల్పోయింది. 26వ ఓవర్‌లో అశ్విన్‌ వేసిన తొలి బంతి మార్ష్‌ బ్యాట్‌ను తాకి గాల్లోకి లేవడంతో పూజారా ఒంటిచేత్తో ఈ క్యాచ్‌ను అందుకున్నాడు. భారత ఆటగాళ్లు అప్పీల్‌ చేయగా అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించాడు. కోహ్లీసేన రివ్యూని ఆశ్రయించింది. రివ్యూలో అశ్విన్‌ వేసిన బంతి బ్యాట్‌ని తాకినట్లు తేలడంతో మార్ష్‌ను ఔట్‌గా ప్రకటించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Matthew Renshaw’s prolific start to his Test career has seen him become the first Australia batsman to reach 500 Test runs before turning 21.
Please Wait while comments are loading...