సంగీత్ వేడుక: కోహ్లీ అల్లరి, కీచ్‌‌ను ముద్దాడిన యువీ (ఫోటోలు)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఇంట పెళ్లి సందడి మొదలైంది. బుధవారం (నవంబర్ 30)నాడు సిక్కు సంప్రదాయ పద్ధతిలో బాలీవుడ్‌ నటి హాజెల్‌కీచ్‌‌తో యువరాజ్ పెళ్లి చండీగఢ్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా పెళ్లికి ముందురోజైన మంగళవారం మెహందీ వేడుకను ఘనంగా నిర్వహించారు.

సంగీత్ వేడుక

సంగీత్ వేడుక

వివాహ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సంగీత్ వేడుకలో కాబోయే నూతన దంపతులు యువరాజ్ సింగ్, హాజెల్ కీచ్ కొత్త దుస్తులతో సందడి చేశారు. మంగళవారం ఓ హోటల్‌లో జరిగిన మెహందీ వేడుకలో పెళ్లికూతురు హాజెల్‌ కీచ్‌తో యువీ సెల్ఫీలు తీసుకుంటూ ఎంతో సరదాగా కనిపించాడు.

సరికొత్త లుక్‌లో యువరాజ్

సరికొత్త లుక్‌లో యువరాజ్

ఇక ఆరు బంతుల్లో ఆరు సిక్సర్ల బాదిన యువరాజ్ గడ్డంతో సరికొత్త లుక్‌లో ఫ్రెష్‌ కనిపించాడు. కాబోయే సతీమణి హాజెల్ కీచ్‌తో ఫోటోలకు ఫోజులిచ్చాడు. హాజెల్ కీచ్ నుదురుపై ముద్దాడుతున్న ఫొటోను యువీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఈ రోజు నుంచి కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నా. మీ ప్రేమకు కృతజ్ఞతలు. కొత్త జంటను ఆశీర్వదించండి' అంటూ పోస్టు చేశాడు.

చేతికి పెట్టిన మెహందీని చూపించిన కీచ్

చేతికి పెట్టిన మెహందీని చూపించిన కీచ్

మరోవైపు అదే ఫోటోల్లో కొన్నింటిని హాజెల్‌ కీచ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఫొటోల్లో కీచ్‌.. చేతికి పెట్టిన మెహందీని చూపిస్తూ ఎంతో ఆనందంగా కనిపించింది. ఇదిలా ఉంటే చండీగఢ్‌లోని ఓ హోటల్‌లో జరిగిన ఈ మెహందీ వేడుకకు టీమిండియా హాజరైంది.

ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్‌‌లో కోహ్లీ సందడి

ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్‌‌లో కోహ్లీ సందడి

యువరాజ్ సింగ్ ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్‌కు టీమిండియా హాజరవుతుందని మొహాలి టెస్టు అనంతరం కోహ్లీ చెప్పిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మంళవారం జరిగిన మెహందీ, సంగీత్‌ కార్యక్రమాలకు టీమిండియా హాజరైంది. ఈ కార్యక్రమాల్లో యువరాజ్‌, హాజెల్‌ కీచ్‌ సందడి చేశారు.

ఆకట్టుకున్న వధూవరుల వస్త్రధారణ

ఆకట్టుకున్న వధూవరుల వస్త్రధారణ

వధూవరుల వస్త్రధారణ ఆకట్టుకుంది. సింగర్‌ రంజిత్‌ భవా ఆధ్వర్యంలోని సంగీత్‌ కార్యక్రమం ఆద్యంతం సందడిగా సాగింది. ఈ సందర్భంగా యువీ ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్‌లో యువరాజ్‌తో పాటు టీమిండియా పాల్గొన్న ఫోటోలు యువీకి కాబోయే సతీమణి హాజెల్ కీచ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.

సిక్కు సంప్రదాయం బుధవారం పెళ్లి

సిక్కు సంప్రదాయం బుధవారం పెళ్లి

కాగా, బుధవారం చండీగఢ్‌లో సిక్కు సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరగనుంది. ఆ తర్వాత డిసెంబర్ 2న గోవాలో హిందూ సంప్రదాయం ప్రకారం మరోసారి వివాహం జరిపించనున్నారు. ఈ కార్యక్రమానికి వధూవరుల కుటుంబసభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరుకానున్నారు. డిసెంబర్ 5న చత్తార్‌పూర్‌లో సంగీత్, 7న ఢిల్లీలోని ఓ హోటల్‌లో రిసెప్షన్ జరుగనుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The big day is almost here. Cricketer Yuvraj Singh and British-Mauritian actor Hazel Keech had their Mehendi this morning, followed by a cocktail reception in the evening. The two will tie the knot in Chandigarh on Wednesday.
Please Wait while comments are loading...