ఐపీఎల్: వృద్ధిమాన్ సాహా 93 పరుగుల వీడియోని చూశారా?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో ప్లే ఆఫ్ బెర్తు దక్కించుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో తడబడకుండా నిలబడింది కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు. వాంఖడె వేదికగా గురువారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు l

తద్వారా పదో సీజన్‌లో ప్లే ఆఫ్‌ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి మొత్తం 453 పరుగులు చేశాయి. తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 3 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. దీంతో ముంబైకి 231 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

MI vs KXIP: Wriddhiman Saha promises more fearless cricket after 93* delivers win vs Mumbai Indians

పంజాబ్ ఓపెనర్ ఆమ్లా అందుబాటులో లేకపోవడంతో అతని స్థానంలో సాహాను ఓపెనర్‌గా వచ్చాడు. ఈ క్రమంలో పంజాబ్ ఓపెనర్లు గప్టిల్, సాహా మంచి శుభారంబాన్ని అందించారు. మలింగ వేసిన మూడో ఓవర్లో గప్టిల్, సాహాలు బౌండరీలతో విరుచుకపడి 19 పరుగులు సాధించారు.

ఈ దూకుడుతో పంజాబ్ ఐదు ఓవర్లలోనే 60 పరుగులు చేయగలిగింది. మార్టిన్ గప్టిల్ (37) కరణ్ శర్మ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి హార్థిక్ పాండ్యా బౌలింగ్‌లో తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మాక్స్‌వెల్, సాహాతో కలిసి స్కోరు బోర్డును పరుగెత్తించాడు.

హార్భజన్ వేసిన 9 ఓవర్లో మూడు సిక్స్‌లు బాది 21 పరుగులు రాబట్టారు. ఈ దశలో చెలరేగి ఆడుతున్న మ్యాక్స్‌వెల్‌... బుమ్రా బౌలింగ్‌లో 5 సిక్సర్లు, 2 ఫోర్లతో 47 పరుగులు చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన షాన్ మార్ష్‌తో సాహా ఇన్నింగ్స్ కొనసాగించాడు.

హార్భజన్ వేసిన బంతిని సిక్సర్‌గా మలిచిన సాహా 30 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఈ సమయంలో భారీ షాట్‌కు ప్రయత్నించిన షాన్ మార్ష్ (25) క్యాచ్ రూపంలో మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. చివర్లో సాహా, అక్సర్ దాటిగా ఆడటంతో పంజాబ్ మూడు వికెట్లు కోల్పోయి ఈ సీజన్లోనే అత్యధిక పరుగులు 230 చేసిన జట్టుగా పంజాబ్ నిలిచింది.

అనంతరం 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 223 పరుగులు మాత్రమే చేసింది. ముంబై బ్యాట్స్‌మెన్లలో సిమ్మన్స్ 59, పొలార్డ్ 50 పరుగులతో రాణించి ముంబైని గెలిపించినంత పనిచేశారు.

చివరి ఓవర్‌లో ముంబై విజయానికి 16 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో మోహిత్‌శర్మ చాలా అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. రెండో బంతికి పొలార్డ్‌ సిక్స్‌ కొట్టిన పొలార్డ్‌ను 3,4,5 బంతుల్లో కనీసం సింగిల్‌ తీయనీయలేదు. చివరి బంతికి ఒక పరుగే రావడంతో పంజాబ్‌ను 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Wriddhiman Saha slammed 93* off 55 balls as Kings XI Punjab beat the the Mumbai Indians by seven runs at the Wankhede to keep their playoff hopes alive. Saha, who was promoted up the order after Hashim Amla left, started the innings with a bang along with Martin Guptill.
Please Wait while comments are loading...