క్వాలిఫయిర్-2: రోహిత్ ఇలా, గణాంకాలు ఏం చెబుతున్నాయంటే!

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ముంబై ఇండియన్స్ అద్భుతమైన రికార్డు ఉంది. ఇరు జట్లు ఐపీఎల్‌లో తలపడిన 20 మ్యాచ్‌ల్లో 15 మ్యాచ్‌ల్లో ముంబైదే విజయం. పదో సీజన్ లీగ్ దశలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ముంబై పైచేయి సాధించింది.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు 

తాజాగా బెంగళూరు వేదికగా జరుగుతున్న క్వాలిఫయిర్-2లో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. అయితే కోల్‌కతా ఉన్న రికార్డుల గురించి అస్సలు ఆలోచించడం లేదని ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు.

Rohit Sharma not swayed by rich history against rivals

'ఈ టోర్నమెంట్లో కోల్ కతాపై రెండు సార్లు విజయం సాధించామనే ఆలోచన లేదు. కేవలం ఈ రోజు మ్యాచ్ పైనే మా దృష్టి ఉంది. తమదైన రోజున ఎవరైతే బాగా ఆడతారో వారే గెలుస్తారు. అంతేకానీ పాత రికార్డులు ఇక్కడ పని చేయవు. కాకపోతే కోల్ కతాపై గెలుస్తామనే ధీమాతో ఉన్నాం' అని రోహిత్ అన్నాడు.

క్వాలిఫయిర్-2: కోల్‌కతా 107 ఆలౌట్, ముంబై 108 కొడితే ఫైనల్‌కే

ఇరు జట్ల మధ్య గణాంకాలు ఏం చెబుతున్నాయంటే:
* ముంబై ఓపెనర్‌ సిమన్స్‌కు కోల్‌కతాలోని నరైన్‌ బౌలింగ్‌లో పేలవ రికార్డు ఉంది. గతంలో ఎదుర్కొన్న 9 బంతుల్లో 5 పరుగులే చేసి అవుటయ్యాడు.
* మరో ఓపెనర్‌ పార్థివ్‌ పటేల్‌ ఆఫ్‌ స్పిన్‌లో ఆడేందుకు ఇబ్బంది పడుతున్నాడు. అతడు ఆఫ్‌స్పిన్‌లో 19 బంతుల్లో 17 పరుగులే చేశాడు.
* ముంబై కెప్టెన్ రోహిత్‌ శర్మ లెగ్‌స్పిన్‌ ఆడటం ఇబ్బంది ఫీలయ్యాడు. ఈ సీజన్‌లో ఐదుసార్లు లెగ్‌స్పిన్‌ బౌలింగ్‌లోనే పెవిలియన్‌ చేరాడు.
* ఒక ఐపీఎల్‌ సీజన్‌లో రోహిత్‌శర్మకు ఇదే అత్యల్ప స్కోరు (283).
* 2009లో దక్షిణాఫ్రికాలో 362 పరుగులు దీనికి కంటే ముందుగా ఉన్నాయి.
* గత ఐపీఎల్‌ సీజన్లతో పోలిస్తే ఈ సీజన్‌‌లో ఎక్కువ సార్లు (9 సార్లు) అవుటయ్యాడు.
* సీజన్‌లో క్రిస్‌ లిన్‌, సునీల్‌ నరైన్‌, గంభీర్‌ వల్ల నైట్‌రైడర్స్‌ పవర్‌ప్లేలో ఎక్కువ పరుగులు సాధించింది.
* ముంబై ఇండియన్స్‌ చిన్నస్వామి మైదానంలో ఇప్పటి వరకు ఒకే ఒక్క నాకౌట్‌ మ్యాచ్‌ ఆడింది. 2012లో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఎలిమినేటర్‌లో తలపడింది.
* ముంబై ఇండియన్స్‌ 2011 ప్లేఆఫ్‌లో కోల్‌కతాపై విజయం సాధించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Old foes Kolkata Knight Riders and Mumbai Indians will lock horns for the third time for a place in the Indian Premier League final when they meet in Qualifer 2 at Bengaluru's M Chinnaswamy Stadium on Friday.
Please Wait while comments are loading...