న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎందుకిలా జరిగింది?: కల నెరవేరకుండానే మిథాలీ నిష్క్రమణ!

24 ఏళ్ల పాటు సచిన్ టెండూల్కర్ భారత క్రికెట్‌కు తన సేవలందించాడు. తన సుదీర్ఘ క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించాడు. అయితే ఒకే ఒక్క వెలితి మాత్రం సచిన్‌ని ఎంతగానో ఒత్తిడికి గురి చేసింది.

By Nageshwara Rao

హైదరాబాద్: 24 ఏళ్ల పాటు సచిన్ టెండూల్కర్ భారత క్రికెట్‌కు తన సేవలందించాడు. తన సుదీర్ఘ క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించాడు. అయితే ఒకే ఒక్క వెలితి మాత్రం సచిన్‌ని ఎంతగానో ఒత్తిడికి గురి చేసింది. వరల్డ్ కప్‌ను ముద్దాడాలన్న తన కలను నెరవేర్చుకోవడానికి సుమారు రెండు దశాబ్దాలకు పైగా నిరీక్షించాడు.

2003లో వరల్ కప్ ఫైనల్‌కు చేరినా ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి పాలవడంతో అది సాధ్య పడలేదు. అయితే 2011లో సచిన్ తన వరల్డ్ కప్ కోరికను తీర్చుకున్నాడు. సచిన్ లాగే ఇప్పుడు మహిళల క్రికెట్‌లో ఎన్నో రికార్డులు నెలకొల్పిన మిథాలీ రాజ్‌ కూడా వరల్డ్ కప్ అందుకుని తన కెరీర్‌కు ముగింపు ఇస్తుందని అంతా భావించారు.

అయితే ఆదివారం లార్డ్స్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో అలా జరగలేదు. 28 పరుగుల వ్యవధిలో చివరి 7 వికెట్లు కోల్పోయి 9 పరుగుల స్వల్ప తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. 229 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 48.4 ఓవర్లలో 219 పరుగులు చేసి ఆలౌటైంది.

16 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి

16 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి

అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. మహిళల క్రికెట్‌లో అత్యధిక పరుగుల చేసిన క్రికెటర్‌గా మిథాలీ రాజ్ ఇదే టోర్నీలో చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. 16 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి 18 ఏళ్లుగా భారత జట్టుకు సేవలందిస్తోంది.

జట్టులో కీలక సభ్యురాలిగా

జట్టులో కీలక సభ్యురాలిగా

మహిళల క్రికెట్లో అంతగా గుర్తింపు లేకపోయినా నిబద్ధతతో ఆటలో కొనసాగుతూ జట్టులో కీలక సభ్యురాలిగా ఉంటూ కెరీర్లో అత్యధిక కాలం కెప్టెన్‌గా జట్టును నడిపిస్తోంది. అంతేకాదు మహిళల క్రికెట్లో మరెన్నో రికార్డులను మిథాలీ సొంతం చేసుకుంది. అయితే అలాంటి రికార్డులు ఎన్ని ఉన్నా వరల్డ్ కప్ విజయం ఎంతో ప్రత్యేకం.

ఇప్పటికీ బ్యాటింగ్‌లో పదును తగ్గలేదు

ఇప్పటికీ బ్యాటింగ్‌లో పదును తగ్గలేదు

త్వరలో తన 35వ పుట్టినరోజుని జరుపుకోనున్న మిథాలీ రాజ్ బ్యాటింగ్‌లో ఇప్పటికీ పదును తగ్గలేదు. ఈ వరల్డ్ కప్‌లో మిథాలీ రాజ్ అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడింది. కీలక ఇన్నింగ్స్‌లతో జట్టును ముందుండి నడిపించింది. అయితే ఫైనల్లో రనౌట్ అయింది. ఫైనల్లో ఆమె రనౌట్ గనుక కాకపోయి ఉంటే జట్టుని తప్పక గెలిపించేదేమో.

మిథాలీ రాజ్ చరిత్ర

మిథాలీ రాజ్ చరిత్ర

అంతేకాదు కెప్టెన్‌గా రెండు వరల్డ్ కప్ ఫైనల్ ఆడిన మొదటి భారత క్రికెటర్‌గా మిథాలీ రాజ్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. కెప్టెన్‌గా కప్పు గెలిస్తే మిథాలీ రాజ్‌కి అది ఇంకా ప్రత్యేకం. కెరీర్‌ను సగర్వంగా, సంతృప్తిగా ముగించడానికి అవకాశం ఉండేది. 2005లోనే వరల్డ్ కప్ అందుకునే అవకాశం వచ్చింది.

మిథాలీ ఆశలపై ఇంగ్లాండ్ నీళ్లు

మిథాలీ ఆశలపై ఇంగ్లాండ్ నీళ్లు

అయితే అప్పుడు ఆస్ట్రేలియా తన ఆశలపై నీళ్లు చల్లగా, ఇప్పుడు ఇంగ్లాండ్ వరల్డ్ కప్‌ని రాకుండా అడ్డుకున్నాయి. 35వ పడికి చేరువగా ఉన్న మిథాలీ మరో వరల్డ్ కప్ ఆడే అవకాశం లేదు. ఇదే విషయాన్ని లార్డ్స్‌లో ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం మిథాలీనే స్వయంగా చెప్పింది.

అభిమానుల్ని బాధించే విషయం అదే

అభిమానుల్ని బాధించే విషయం అదే

2003లో నిరాశ ఎదురైనా.. 2011లో సచిన్‌ కప్పు అందుకున్నాడు. అలాగే 2005లో చేజారిన కప్పును మిథాలీ ఈసారి కచ్చితంగా అందుకుంటుందనే క్రికెట్ అభిమానులు ఆశించారు. కానీ అలా జరగలేదు. మొత్తానికి ప్రపంచకప్‌ కల నెరవేరకుండానే మిథాలీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పబోతుండటం ఆమె అభిమానుల్ని బాధించే విషయమని తప్పక చెప్పాలి.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X