దక్షిణాఫ్రికాపై విజయం: సక్లయిన్‌కు మద్దతుగా నిలిచిన అలీ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: పాక్ మాజీ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్‌ని ఇంగ్లండ్ జట్టుకి పూర్తిస్థాయి స్పిన్ బౌలింగ్ కోచ్‌గా నియమిస్తే బాగుంటుందని ఆ జట్టు ఆల్ రౌండర్ మొయిన్ అలీ అభిప్రాయపడ్డాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్ 3-1 తేడాతో నెగ్గిన సంగతి తెలిసిందే.

ఇంగ్లండ్ విజయంలో మొయిన్ అలీ కీలకపాత్ర పోషించాడు. ఈ సిరిస్‌లో 250కి పైగా పరుగులు, 25 వికెట్లతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సిరిస్‌ను సొంతం చేసుకున్నాడు. అంతేకాదు ఈ సిరిస్ ద్వారా మెయిన్ అలీ ఓ అరుదైన ఘనతను కూడా సాధించాడు.

Moeen Ali bats for permanent role for Saqlain Mushtaq

ఓవల్ వేదికగా జరిగిన దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో మొయిన్ అలీ హ్యాట్రిక్ (4/45) వికెట్లతో చెలరేగాడు. వందో టెస్టుకి వేదికైన ఓవల్‌ గ్రౌండ్‌లో ఇదే తొలి హ్యాట్రిక్‌ కాగా... 79 ఏళ్ల తర్వాత హ్యాట్రిక్‌ సాధించిన తొలి ఇంగ్లాండ్‌ స్పిన్నర్‌గా అలీ నిలిచాడు.

మరోవైపు నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 250కి పైగా పరుగులు, 25 వికెట్లు సాధించిన తొలి టెస్టు క్రికెటర్‌గా మొయిన్ అలీ గుర్తింపు పొందాడు. అయితే తన స్పిన్ మెరుగుపడటానికి ఇంగ్లండ్ జట్టు స్పిన్న్ కన్సల్టెంట్‌గా పని చేస్తున్న పాక్ మాజీ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్ కారణమని చెప్పాడు.

'సక్లయిన్‌తో కలిసి పని చేయడం చాలా బాగుంది. నా స్పిన్ బౌలింగ్‌ మెరుగు పడటంలో సక్లయిన్ అమూల్యమైన సలహాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అతన్ని తాత్కాలిక స్పిన్ సలహాదారుగా కాకుండా పూర్తి స్థాయి స్పిన్ బౌలింగ్ కోచ్ బాధ్యతల్ని అప్పగిస్తే బాగుంటుంది' అని అన్నాడు.

Moeen Ali bats for permanent role for Saqlain Mushtaq

అంతేకాదు అతడి సలహాలు, సూచనలు మూడు ఫార్మెట్లకు ఎంతో ఉపయోగమని చెప్పాడు. సాధారణంగా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లు ఉన్నప్పుడు స్పిన్ బౌలింగ్‌కు కోచ్ ఉండాలని తన అభిప్రాయాన్ని చెప్పాడు. త్వరలో ఇంగ్లండ్ జట్టు యాషెస్ సిరీస్‌కు సిద్దమవుతుంది.

ఇలాంటి సమయంలో సక్లయిన్ సేవలు ఎంతో అమూల్యమని సక్లయిన్ అన్నాడు. ఆగస్టు 17 నుంచి బర్మింగ్ హామ్ వేదికగా వెస్టిండిస్‌తో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ప్రారంభం కానుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
England all-rounder Moeen Ali has called on the country's cricket board to employ spin consultant Saqlain Mushtaq on permanent basis after the Joe Root-led side registered a 3-1 win in the four-match Test series against South Africa.
Please Wait while comments are loading...