ఈ తరం క్రికెటర్లు కొత్తగా: అజారుద్దీన్ పేరిట మొబైల్ గేమ్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: బీసీసీఐ భారత జట్టుకు అందించిన అత్యుత్తమ కెప్టెన్లలో హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ అజహరుద్దీన్ ఒకరు. అయితే ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో క్రికెట్‌కు పూర్తిగా దూరమయ్యారు. తాను క్రికెట్ ఆడిన రోజుల్లో అజహరుద్దీన్ బ్యాటింగ్ అభిమానులకు ఓ విజువల్ ట్రీట్ అనే చెప్పొచ్చు.

తాజాగా అజహరుద్దీన్ ఈ తరం క్రికెటర్లకు 'అజార్-ది కెప్టెన్' అనే ఓ మొబైల్ గేమ్ ద్వారా పరిచయం అవుతున్నారు. ఈ విషయాన్ని అజహరుద్దీన్ తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఈ పోస్టు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

భారత్ తరుపున 99 టెస్టులాడిన అజహరుద్దీన్ 6216 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు, 21 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇక 334 వన్డేలాడి 9378 పరుగులు చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 58 అర్ధసెంచరీలు ఉన్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
For those who saw, it will be tough to forget the visual of Mohammad Azharuddin batting. Flicks executed standing tall, drives that saw his wrists uncoiling like a spring, it was a sight for Gods.
Please Wait while comments are loading...