ఇండియా బెస్ట్ కెప్టెన్ ధోనియా?: గంగూలీకి మద్దతుగా అజహర్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి ప్రకటించిన ది గ్రేట్ కెప్టెన్ల జాబితాలో సౌరభ్ గంగూలీ పేరు లేకపోవడంపై మాజీ కెప్టెన్‌, హైదరాబాదీ స్టైలిష్ బ్యాట్స్‌మ‌న్ మహ్మద్ అజారుద్దీన్ మండిపడ్డాడు. విజ్డన్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్యూలో రవిశాస్త్రి భారత అత్యుత్తమ కెప్టెన్ల జాబితాలో గంగూలీకి స్థానం ఇవ్వని సంగతి తెలిసిందే.

ధోనియే అత్యుత్తమ కెప్టెన్ అని కితాబివ్వడంతో పాటు అతడికి దరిదాపుల్లో కూడా ఎవరూ లేరని ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. దీనిపై హిందూస్తాన్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్యూలో అజారుద్దీన్ స్పందించాడు. ఇది నిజంగా తెలివి తక్కువ నిర్ణయమని రవిశాస్త్రిని విమర్శించాడు.

'అత‌నికి గంగూలీ గ‌ణాంకాలు క‌నిపించ‌డం లేదా. వ్యక్తుల గురించి అత‌ను ఏమ‌నుకుంటున్నాడ‌న్న‌ది అన‌వ‌స‌రం. కానీ టీమిండియా అత్యుత్తమ కెప్టెన్ల జాబితా త‌యారుచేసిన‌ప్పుడు అత‌ని వ్య‌క్తిగ‌త విభేదాల‌ను తెర‌పైకి తెచ్చి జట్టుకు ఎన్నో మ‌ర‌పురాని విజ‌యాలు అందించిన వారిని అవ‌మానించ‌కూడ‌దు' అని అన్నాడు.

మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా ధోనీ

మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా ధోనీ

భారత్ జట్టుకు 27 టెస్టు విజ‌యాల‌నందంచి మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా ధోనీ నిలిచాడు. దాదా ఆఫ్ ఆల్ కెప్టెన్స్ అంటూ ర‌విశాస్త్రి ధోనీని అభివ‌ర్ణించిన సంగతి తెలిసిందే. అయితే 21 విజ‌యాల‌తో అత‌ని వెంటే రెండోస్థానంలో ఉన్న గంగూలీని మాత్రం ర‌విశాస్త్రి విస్మ‌రించాడు.

మూడో స్ధానంలో కోహ్లీ, అజారుద్దీన్

మూడో స్ధానంలో కోహ్లీ, అజారుద్దీన్


ఇక 14 టెస్టు విజయాలతో విరాట్ కోహ్లీ, అజహరుద్దీన్ మూడో స్ధానంలో నిలిచారు. భారత హెడ్ కోచ్ ఎంపిక విష‌యంలోనే ఈ ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. తనకు కోచ్ పదవి వస్తుందని భావించిన రవిశాస్త్రికి చివ‌రి నిమిషంలో చ‌క్రం త‌ప్పిన గంగూలీ.. కుంబ్లే పేరుని తెరపైకి తీసుకొచ్చాడు.

ఇద్దరి మధ్య మాటల తూటాలు

ఇద్దరి మధ్య మాటల తూటాలు


ఈ క్రమంలో వీరిద్దరి మధ్యా మాటల తూటాలు పేలాయి. ఆ విషయాన్ని మనసులో పెట్టుకొనే ర‌విశాస్త్రి త‌న జాబితాలో నుంచి గంగూలీ పేరును త‌ప్పించాడని వార్తలు సైతం వచ్చాయి. మరోవైపు తన జాబితాపై రవిశాస్త్రి ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ గణాంకాలాను నమోదు చేసిన భారత కెప్టెన్లకే తన జాబితాలో స్థానం కేటాయించినట్లు పేర్కొన్నాడు.

ధోనీ దరిదాపుల్లో ఎవరూ లేరు

ధోనీ దరిదాపుల్లో ఎవరూ లేరు


‘భారత క్రికెట్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌ ధోనీనే. అతడికి దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. అతడి తర్వాత కపిల్‌ దేవ్‌ ఉంటాడు. అతను 1983 ప్రపంచకప్‌లో భారత్‌ను విజేతగా నిలిపాడు. వన్డేలు రాకముందు వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌ పర్యటనల్లో జట్టును గెలిపించిన వాడేకర్‌ తర్వాత నిలుస్తాడు. దూకుడుకు మారుపేరైన టైగర్‌ పటౌడీ ఈ జాబితాలో తర్వాత ఉంటాడు'' అని శాస్త్రి పేర్కొన్నాడు.

49 టెస్టులకు సారథ్య వహించి గంగూలీ

49 టెస్టులకు సారథ్య వహించి గంగూలీ


మరోవైపు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ తన కెరీర్‌లో 49 టెస్టులకు సారథ్య వహించి 42.6 విజయశాతాన్ని నమోదు చేశాడు. ఇక 147 వన్డేలకు కెప్టెన్‌గా ఉన్న గంగూలీ 76 మ్యాచ్‌ల్లో భారత్‌కు విజయానందించాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former India captain Mohammed Azharuddin expressed shock and surprise at Ravi Shastri omitting Sourav Ganguly from his list of best captains. Shastri had praised MS Dhoni, hailing him the ‘dada of all captains’, and kept him ahead of Kapil Dev, Ajit Wadekar and Tiger Pataudi, adding ‘there is no one else’.
Please Wait while comments are loading...