కోహ్లీకి షాకిచ్చిన పాంటింగ్: తన డ్రీమ్ టీమ్ కెప్టెన్‌గా ధోని

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: పదేళ్ల ఐపీఎల్ సందర్భంగా ముంబై ఇండియన్స్ మాజీ కోచ్, ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ తన ఆల్ టైమ్ ఐపీఎల్ ఎలెవన్ జట్టుని శుక్రవారం ప్రకటించాడు. పాంటింగ్ ఎంపిక చేసిన జట్టులో ఏడుగురు భారత ఆటగాళ్లు చోటు దక్కించుకోగా, నలుగురు విదేశీ క్రికెటర్లకు చోటు దక్కింది.

MS Dhoni captain of Ricky Ponting's all-time IPL XI

తన డ్రీమ్ టీమ్‌కు కెప్టెన్‌గా ధోనిని ఎంచుకున్నాడు. అంతేకాదు స్పిన్నర్ అమిత్ మిశ్రాకు చోటు కల్పించాడు. ఐపీఎల్‌‌లో అమిత్ మిశ్రాకు మంచి రికార్డు ఉందని పాంటింగ్‌ గుర్తు చేశాడు. పాంటింగ్ ఎంపిక చేసిన జట్టులో విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, సురేశ్‌ రైనా, హర్భజన్ సింగ్‌, ఆశిష్‌ నెహ్రా, క్రిస్‌ గేల్‌, డేవిడ్‌ వార్నర్‌, డ్వేన్‌ బ్రావొ, లలిత్‌ మలింగలు ఉన్నారు.

విధ్వంసకర ఓపెనర్లు క్రిస్‌గేల్‌, డేవిడ్‌ వార్నర్‌ను ఎంపిక చేశాడు. వారితో పాటు విండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో, శ్రీలంక బౌలర్‌ లసిత్‌ మలింగ్‌ను తీసుకొన్నాడు. ఏబీ డివిలియర్స్‌ టీ20 క్రికెట్‌కు బ్లూప్రింట్‌ అన్నాడు. అయితే జట్టు ఎంపికలో అతడి చోటు దక్కకపోవడం దురదృష్టకరం అన్నాడు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని కాదని, ధోనిని ఎందుకు కెప్టెన్‌గా ఎంచుకున్నాననే దానిపై కూడా పాంటింగ్ వివరించాడు. 'ధోని ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతాడు. అతడు క్రీజులో ఉంటే తప్పకుండా జట్టును గెలిపించి తీరతాడు. తన బ్యాటుతో ఎన్నోసార్లు అతడీ విషయాన్ని రుజువు చేశాడు. అతడికి అపారమైన అనుభవం ఉంది. కీపింగ్‌లోనూ సత్తా చాటాడు' అని పాంటింగ్ అన్నాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former Australian skipper Ricky Ponting has picked Indian stalwart Mahendra Singh Dhoni as the captain of his all-time IPL XI, which comprises seven Indians and four foreigners. The other Indians in the Australian's team are Virat Kohli, Rohit Sharma, Suresh Raina, Harbhajan Singh, Ashish Nehra and Amit Mishra.
Please Wait while comments are loading...