ఏదైనా జరగొచ్చు: 2019 వరల్డ్ కప్‌లో ఆడటంపై ధోని

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఇప్పట్లో రిటైరయ్యే ఆలోచనలేదని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్పష్టం చేశాడు. ఈ ఏడాది ఇంగ్లాండ్‌లో జరిగే చాంపియన్స్‌ ట్రోఫీతో ధోని తన క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతాడని కొందరు అంచనా వేయగా, ప్రస్తుతం ధోని ఫిట్‌గా ఉన్నాడని 2019 వరల్డ్‌కప్‌ వరకు కొనసాగుతాడని మరికొందరు వెల్లడించారు.

అయితే తన క్రికెట్ భవితవ్యంపై మహేంద్ర సింగ్ ధోని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇటీవలే ఓ కార్యక్రమంలో పాల్గొన్న ధోని మరో రెండేళ్లలో జరగనున్న ఐసీసీ వరల్డ్ కప్‌ టోర్నీలో పాల్గొనే విషయమై చెప్పకనే చెప్పాడు.

MS Dhoni finally speaks about possibilty of playing 2019 World Cup and many will be surprised

'నూటికి నూరు శాతం 2019 వరల్డ్‌కప్‌ ఆడగలనా అంటే నేనెలా చెప్పగలను. ప్రపంచక్‌పకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. ఈలోగా ఏదైనా జరగొచ్చు. నేను గాయాలపాలవ్వచ్చు. అది మన చేతుల్లో ఉండదు కదా. కానీ ప్రస్తుత నా ఫిట్‌నెస్‌ ఆధారంగా చెప్పాలంటే మాత్రం 2019 వరల్డ్‌కప్‌ తర్వాత కూడా ఆడగలను' అని ధోని చెప్పాడు.

2019 వరల్డ్ కప్‌లో కూడా ధోని పాల్గొంటే వరుసగా నాలుగు వరల్డ్ కప్‌ల్లో ఆడిన ఆటగాడిగా చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
MS Dhoni's decision to relinquish India's captaincy has given rise to speculations about his cricketing future. While many believe that 2017 Champions Trophy in England is going to be his swansong.
Please Wait while comments are loading...