26 బంతుల్లో 40 పరుగులు: ధోని మెరుపు ఇన్నింగ్స్‌పై ప్రశంసలు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: వాంఖడె వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న క్వాలిఫెయర్-1 మ్యాచ్‌లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ బ్యాట్స్‌మెన్ తడబడి నిలబడ్డారు. మనోజ్ తివారి (48 బంతుల్లో 58; 4x4, 2x6), రహానే (43 బంతుల్లో 56; 5x4, 1x6), అర్ధ సెంచరీలు చేయడంతో పూణె నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.

చివరి రెండు ఓవర్లలో వెటరన్ ధోని ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ముంబై బౌలర్లు ఆఖరి ఓవర్లలో తేలిపోయారు. మెక్లనగన్‌ వేసిన 19 ఓవర్లో ధోనీ తన విశ్వరూపం ప్రదర్శించాడు. తివారీ ఒక ఫోరు, సిక్స్‌.. ధోనీ రెండు సిక్సర్లు బాదడంతో ఆ ఓవర్లో అత్యధికంగా 26 పరుగులు వచ్చాయి.

చివరి ఓవర్లో 15 పరుగులు

బుమ్రా వేసిన ఇన్నింగ్స్‌ చివరి ఓవర్లో సైతం రెండు సిక్సర్లు బాదిన ధోనీ 15పరుగులు రాబట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో పూణె 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. దీంతో ముంబై ఇండియన్స్‌కు 163 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ పుణె‌ని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

మనోజ్ తివారీతో కలిసి రహానే కీలక భాగస్వామ్యం

ఓపెనర్ రాహుల్ త్రిపాఠి‌ని తొలి ఓవర్‌లోనే డకౌట్‌ చేసి మెక్లనగాన్ పుణె‌కి షాకిచ్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన స్టీవ్‌స్మిత్‌(1)ని రెండో ఓవర్‌లో మలింగ అవుట్ చేయడంతో పూణె ఒత్తిడిలో పడింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన రహానే మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ మనోజ్ తివారీతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.

మూడో వికెట్‌కి 80 పరుగులు

ముంబై బౌలర్లని సమర్థంగా ఎదుర్కొన్న ఈ జోడీ మూడో వికెట్‌కి 80 పరుగులు జోడించింది. ఈ క్రమంలోనే 39 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసిన రహానే.. కర్ణశర్మ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. రహానే అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మహేంద్రసింగ్ ధోని (26 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్ల)తో నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించాడు.

19వ ఓవర్‌లో ధోని విశ్వరూపం

ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన మెక్లనగాన్ బౌలింగ్‌లో ధోని రెండు సిక్సర్లు కొట్టి స్కోరు బోర్డుని పరిగెత్తించాడు. మనోజ్ తివారీ కూడా ఒక ఫోర్, ఒక సిక్స్ బాదడంతో ఈ ఓవర్‌‌లో పుణె ఏకంగా 26 పరుగులు సాధించింది. చివరి ఓవర్ వేసిన బుమ్రాపై కూడా ధోని విరుచుకుపడ్డాడు. ఈ ఓవర్‌లో రెండు సిక్స్‌లు బాదిన ధోని 15 పరుగులు రాబట్టాడు.

సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం

ధోని మెరుపులపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. ధోని అభిమానులు ధోనిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అవమానకర రీతిలో ధోనిని కెప్టెన్సీ నుంచి తప్పించిన రైజింగ్ పూణె ప్రాంచైజీ యజమానులు సైతం ధోని ఇన్నింగ్స్‌కు ముగ్దులైన చప్పట్లతో తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Late exploits from veteran India cricketer Mahendra Singh Dhoni and fifties from Ajinkya Rahane and Manoj Tiwari helped Rising Pune Supergiant to 163/4 against Mumbai Indians in Qualifier 1 of the Indian Premier League (IPL) 2017.
Please Wait while comments are loading...