ప్రాక్టీస్ సెషన్‌కు కోహ్లీ దూరం: కారణం అదేనా...

Posted By:
Subscribe to Oneindia Telugu

ధర్మశాల: శనివారం నుంచి ధర్మశాలలో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఆఖరి టెస్ట్ జరగనున్న నేపథ్యంలో ప్రాక్టీస్ సెషన్‌కు విరాట్ కోహ్లీ దూరంగా ఉండడం చర్చనీయాశంగా మారింది. ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లు నెట్స్‌లో ప్రాక్టీస్ చేశారు.

దీంతో భుజానికైన గాయం నుంచి విరాట్ ఇంకా కోలుకోలేదనే అనుమానాలు పెరిగాయి. రాంచి టెస్ట్‌లో బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపై క్రమంలో డైవ్ చేసిన కోహ్లీ భుజానికి గాయమైంది. విరాట్ కోహ్లీ లేని కారణంగా ప్రాక్టీస్ సెషన్‌కు మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వం వహించాడు.

MS Dhoni Leads Team In Practice Session In Absence Of Virat Kohli

పిచ్‌ను పరిశీలించడం, లోకల్ ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం వంటి కెప్టెన్ చేసే పనులను ధోనీ చేశాడు. రెండు గంటల పాటు ప్రాక్టీస్ సెషన్ సాగింది. అనిల్ కుంబ్లే కూడా అందుబాటులో లేకపోవడం ధోనీ ఆ పనిచేసినట్లు భావిస్తున్నారు.

ఇదిలావుంటే, కోహ్లీపై ఆస్ట్రేలియా మీడియా దుమ్మెత్తి పోస్తున్న నేపథ్యంలో తమ కెప్టెన్ కోహ్లీకి టీమిండియా పూర్తి మద్దతు తెలుపుతోందని పుజారా చెప్పాడు. కోహ్లీపై ఆసీస్ మీడియా నుంచి అలాంటి కామెంట్లు రావడం చాలా విచారకరమని అన్నాడు. కోహ్లీ గొప్ప నాయకుడని, క్రికెట్‌కు విరాట్ గొప్ప ప్రచారకుడని పుజారా చెప్పాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mahendra Singh Dhoni was in-charge of the team in the optional practice session in the absence of captain Virat Kohli and coach Anil Kumble.
Please Wait while comments are loading...