ఓటమితో ధోని వీడ్కోలు: రాయుడు సెంచరీ వృథా

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: భారత క్రికెట్ చరిత్రలో మహేంద్ర్ సింగ్ ధోని కెప్టెన్సీ అంకం ముగిసింది. ఇప్పటివరకు కెప్టెన్ అంటే తన పేరే గుర్తుకొచ్చేలా భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వ పగ్గాలు వదిలేశాడు.

ధోని వీడ్కోలు మ్యాచ్‌గా జరిగిన వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా ఓడినప్పటికీ, గతంలో మాదిరిగానే తన వ్యూహాలతో ధోని మరోసారి ఆకట్టుకున్నాడు. భారత ఏతో మంగళవారం ముంబైలోని బ్రబౌర్న్‌ స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మూడు వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది.

టాస్ ఓడి టీమిండియా నిర్దేశించిన 305 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ జట్టు ఏడు వికెట్లు కోల్పోయి మరో ఏడు బంతులు మిగిలుండగానే ఛేదించింది. బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ (5/60) మినహా మిగతా బౌలర్లు నిరాశపర్చడంతో భారీస్కోరును కూడా టీమిండియా కాపాడుకోలేకపోయింది.

భారత ఆటగాళ్లకు మంచి బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌

భారత ఆటగాళ్లకు మంచి బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌

వన్డే సిరీస్‌ ఆరంభానికి ముందు భారత ఆటగాళ్లకు మంచి బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ లభించింది. ఫామ్‌లేమి కారణంగా టీమిండియాకు దూరమైన రాయుడు సెంచరీ నమోదు చేశాడు. వన్డే, టీ20 సిరిస్ జట్టు ఎంపికలో తనను విస్మరించిన సెలెక్టర్లకు బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు.

25 పరుగులకే తొలి వికెట్

25 పరుగులకే తొలి వికెట్

ఎనిమిదో ఓవర్‌లోనే ఓపెనర్ మన్‌దీప్ సింగ్ (8) ఔటవడంతో భారత్ 25 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన తెలుగుతేజం అంబటి రాయుడు అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఇక రెండో ఎండ్‌లో ధావన్ కూడా సమయోచితంగా స్పందించడంతో టీమిండియా ఇన్నింగ్స్ నిలకడగా సాగింది.

రెండో వికెట్‌కు 111 పరుగులు

రెండో వికెట్‌కు 111 పరుగులు

ధావన్‌కు జతకలిసిన రాయుడు రెండో వికెట్‌కు 111 పరుగులు జోడించాడు. ఆరంభంలో తడబడిన ధవన్‌ ఆ తర్వాత కుదురుకుని అర్ధ సెంచరీ సాధించాడు. ధావన్‌ అవుటైన తర్వాత రాయుడు, యువరాజ్‌ ఇన్నింగ్స్‌ను నడిపించారు. ఆ తర్వాత యువరాజ్ సింగ్ వచ్చీ రావడంతోనే భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.

యువీ ఫామ్‌లోకి

యువీ ఫామ్‌లోకి

రషీద్ వేసిన 34వ ఓవర్‌లో రెండు భారీ సిక్సర్లు సంధించిన యువీ తాను ఫామ్‌లోకి వస్తే ఎలా ఉంటుందో రుచిచూపెట్టాడు. ఇక అర్ధసెంచరీ పూర్తయిన తర్వాత రాయుడు కూడా విజృంభించాడు. మొయిన్ అలీని లక్ష్యంగా చేసుకుని భారీ షాట్లు ఆడాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 91 పరుగులు జతచేశారు.

సెంచరీ మార్కు చేరుకోగానే రాయుడు రిటైర్డ్‌ అవుట్‌

సెంచరీ మార్కు చేరుకోగానే రాయుడు రిటైర్డ్‌ అవుట్‌

అయితే సెంచరీ మార్కు చేరుకోగానే రాయుడు రిటైర్డ్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. ఈ దశలో వచ్చిన ధోనీ మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. ఈ క్రమంలో ఆ తర్వాత యువీకి ధోనీ జతకలిశాడు. అయితే అర్ధ సెంచరీ పూర్తవగానే యువవరాజ్ సింగ్ అవుటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 45 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 250 పరుగులు చేశాడు.

ధోని 68 నాటౌట్‌

ధోని 68 నాటౌట్‌

40 బంతులను ఎదుర్కొన్న ధోని 8 ఫోర్లు, 2 సిక్సర్లు సాయంతో 68 నాటౌట్‌గా నిలిచాడు. ఆ తర్వాత సంజూ శాంసన్‌ డౌకట్ అయినా హార్దిక్‌ (4 నాటౌట్‌)తో కలిసి ధోనీ స్కోరు 300 పరుగులు దాటించాడు. ధోని చెలరేగి ఆడాడు. వోక్స్ వేసిన ఆఖరి ఓవర్‌లో ధోనీ రెండు భారీ సిక్సర్లతో సూపర్ ఫినిషింగ్ ఇవ్వడంతో భారత్ 304 పరుగులు చేసింది.

 ఇంగ్లాండ్ విజయ లక్ష్యం 305

ఇంగ్లాండ్ విజయ లక్ష్యం 305

ఆ తర్వాత 305 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఏడు వికెట్లు కోల్పోయి మరో ఏడు బంతులు మిగిలుండగానే విజయాన్ని సాధించింది. సామ్‌ బిల్లింగ్స్‌ (85 బంతుల్లో 8 ఫోర్లతో 93), జేసన్‌ రాయ్‌ (62) అర్ధ సెంచరీలతో రాణించారు. అలెక్స్‌ హేల్స్‌ (40), జోస్‌ బట్లర్‌ (46), లియామ్‌ డాసన్‌ (41) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు.

కుల్దీప్‌ యాదవ్‌ (5/60)

కుల్దీప్‌ యాదవ్‌ (5/60)

భారత బౌలర్లలో యువ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ (5/60) ఐదు వికెట్లు పడగొట్టినా మిగతా బౌలర్లు చేతులెత్తేశారు. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత-ఎ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 304 పరుగులు చేసింది. అంబటి రాయుడు (97 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్‌తో 100 రిటైర్డ్‌ అవుట్‌) సెంచరీ సాధించాడు.

రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో రహానే కెప్టెన్

రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో రహానే కెప్టెన్

శిఖర్‌ ధావన్‌ (84 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌తో 63), యువరాజ్‌ సింగ్‌ (48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 56) అర్ధ సెంచరీలతో రాణించారు. చివర్లో మెరుపులు మెరిపించిన కెప్టెన్‌ ధోనీ (40 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 నాటౌట్‌) అర్ధ సెంచరీని సాధించాడు. ఇదిలా ఉంటే ఇదే స్టేడియంలో గురువారం జరిగే మరో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో రహానె నేతృత్వంలోని భారత్ ఏతో ఇంగ్లాండ్ తలపడనుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mahendra Singh Dhoni's last game as captain of an Indian side ended in defeat here tonight (January 10) at the Brabourne Stadium. Dhoni, the batsman enthralled the crowd in Mumbai with a 40-ball 68 not out but he could not get a winning farewell as skipper after India A posted 304/5 in 50 overs.
Please Wait while comments are loading...