కుక్కలకు ఫీల్డింగ్ నేర్పిన ధోని: ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన అనంతరం మహేంద్ర సింగ్ ఎక్కువ సమయాన్ని కుటుంబంతో గడిపేందుకు కేటాయిస్తారు. ప్ర‌స్తుతం వ‌న్డే, టీ20 సిరీస్‌లేమీ లేక‌పోవ‌డంతో ఇంటికే ప‌రిమిత‌మైన ధోని త‌న కూతురు జీవా, పెంపుడు కుక్క‌ల‌తో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు.

ధోనికి కుక్కలంటే ఎంతో ఇష్టం. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ కోచ్‌ అవతారమెత్తి తన పెంపుడు కుక్కలకు ట్రైనింగ్ ఇచ్చాడు. అందుకు సంబంధించిన ఓ వీడియోని తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. మొన్నటి మొన్న జీవాతో కలిసి పాకుతున్న వీడియోని పోస్టు చేసిన ధోని, తాజాగా త‌న మూడు పెంపుడు కుక్క‌ల‌కు ఫీల్డింగ్ ట్రైనింగ్ ఇస్తున్న వీడియోను అభిమానులతో షేర్ చేశాడు.

A post shared by @mahi7781 on Feb 16, 2017 at 9:48pm PST

ఈ వీడియోలో ధోని త‌న కుక్కల‌కు క్యాచ్ ఎలా ప‌ట్టాలో చెబుతుండ‌టం.. అవి కూడా అత‌ని మాట‌ల‌ను సీరియ‌స్‌గా విన‌డం ఆస‌క్తి క‌లిగిస్తుంది. ఈ వీడియోని ధోని తన ఇనిస్టాగ్రామ్ ఖాతాతో షేర్ చేసిన రెండు గంటల్లోనే రెండున్నర లక్షల వ్యూస్ రావడం విశేషం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former Indian cricket team captain, Mahendra Singh Dhoni is a great player on the field and sweetest human off it. The 35-year-old who is enjoying his time after successful England ODI series shared a cute video on Instagram.
Please Wait while comments are loading...