సంగక్కర రికార్డు బద్దలు: టీ20ల్లో ధోని కొత్త రికార్డు ఇదే

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోని... పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా ఎన్నో రికార్డులను సాధించాడు. ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా ఫిరోజ్ షా కోట్లా వేదికగా శుక్రవారం ఢిల్లీ డేర్‌డేవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని మరో మైలురాయిని సాధించాడు.

ఐపీఎల్‌లో ధోని అరుదైన ఘనత: ఈ క్యాచ్‌ని చూశారా! (వీడియో)

MS Dhoni sets new record in T20 cricket during Delhi Daredevils vs RPS match

టీ20 క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న వికెట్ కీపర్‌గా ధోని సరికొత్త రికార్డు సృష్టించాడు. 124 క్యాచ్‌లు అందుకుని శ్రీలంక వికెట్‌ కీపర్‌ కుమార సంగక్కర ఈ జాబితాలో ఇప్పటి వరకు అగ్రస్ధానంలో నిలిచాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో డేనియల్ క్రిస్టియన్ బౌలింగ్‌లో మార్లోన్ శామ్యూల్స్‌ను ఆడిన బంతిని ఒంటి చేత్తో అందుకున్న ధోని ఈ రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.

హుక్‌ చేసేందుకు శ్యామూల్స్‌ యత్నించగా, అది ధోని వైపు ఎడ్జ్‌ తీసుకుంది. ఈ దశలో ధోని తన స్టయిల్‌లో వికెట్ల వెనుక వేగంగా కదిలి ఆ క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో దూకుడుగా ఆడుతున్న శామ్యూల్స్ 14వ ఓవర్‌లో 27 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నాలుగో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు.

మరోవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ధోని వంద మందిని అవుట్‌ చేసిన వికెట్‌ కీపర్‌గా అరుదైన గుర్తింపు పొందాడు. ఉనాద్కత్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్‌ను అవుట్ చేయడం ద్వారా ధోని ఈ ఘనత సాధించాడు. 35 ఏళ్ల ధోని 156 ఐపీఎల్‌ మ్యాచుల్లో 71 క్యాచులు, 29 స్టంపింగ్స్‌ చేశాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
MS Dhoni of Rising Pune Supergiant (RPS) added another feather to his cap during the Indian Premier League (IPL) match against Delhi Daredevils (DD) on Friday. The former India skipper went past Sri Lanka’s Kumar Sangakkara to become the only wicketkeeper to take 124 catches in Twenty20 cricket.
Please Wait while comments are loading...