ముంబైపై పూణె విజయం: ఐపీఎల్‌లో ధోని సరికొత్త రికార్డు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌‌లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ ఫైనల్లోకి ప్రవేశించింది. వాంఖడె వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మంగళవారం జరిగిన క్వాలిఫయిర్ 1 మ్యాచ్‌లో పూణె 20 పరుగుల తేడాతో గెలుపొంది తుది పోరుకు అర్హత సాధించింది.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు  | ఐపీఎల్ పాయింట్ల పట్టిక  | ఐపీఎల్ 2017 ఫోటోలు 

ఈ మ్యాచ్‌లో 26 బంతుల్లో 40 పరుగులు చేసి పూణెను ఐపీఎల్ ఫైనల్స్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించిన మహేంద్ర సింగ్ ధోని మరో రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి పూణె ఫైనల్స్‌కు చేరుకోగా, ధోనికి మాత్రం ఇది 7వ పైనల్ మ్యాచ్ కావడం విశేషం.

MS Dhoni in seventh heaven with another IPL record

ఐపీఎల్ చరిత్రలో ఇది సరికొత్త రికార్డు. ఏడు సార్లు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆడే ఆటగాడిగా ధోని అరుదైన ఘనత సాధించాడు. అంతకముందు ధోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరుపున ఆరుసార్లు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ధోనికి పేరుంది.

క్వాలిఫయిర్ 1లో భాగంగా ముంబైతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో చివరి రెండు ఓవర్లలో వెటరన్ ధోని ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ముంబై బౌలర్లు ఆఖరి ఓవర్లలో తేలిపోయారు. మెక్లనగన్‌ వేసిన 19 ఓవర్లో ధోనీ తన విశ్వరూపం ప్రదర్శించాడు. తివారీ ఒక ఫోరు, సిక్స్‌.. ధోనీ రెండు సిక్సర్లు బాదడంతో ఆ ఓవర్లో అత్యధికంగా 26 పరుగులు రాబట్టాడు.

ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో భాగంగా బుధవారం చిన్నస్వామి స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ రెండింటిలో గెలిచిన జట్టుతో పూణె చేతిలో ఓటమిపాలైన ముంబై ఇండియన్స్ క్వాలిఫయిర్ 2 మ్యాచ్ ఆడనుంది.

క్వాలిఫయిర్ 1: ముంబైకి షాక్, ధోని మెరుపు ఇన్నింగ్స్‌తో ఫైనల్స్‌కు పూణె

ఇక కాంట్రాక్టు ప్రకారం వచ్చే సీజన్‌లో గుజరాత్ లయన్స్, రైజింగ్ పూణె సూపర్ జెయింట్ల ఐపీఎల్లో ఆడవు. ఈ రెండు జట్లు స్ధానంలో రెండేళ్ల పాటు నిషేధానికి గురైన రాజస్ధాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు పునఃప్రవేశం చేయనున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mahendra Singh Dhoni added another record to his name when he and Rising Pune Supergiant (RPS) reached the Indian Premier League (IPL) 2017 final here tonight (May 16).
Please Wait while comments are loading...