ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టిస్తుందా?: చరిత్ర ఏం చెబుతోంది

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఇక నాకౌట్ సమరమే మిగిలింది. దీంతో ప్లేఆఫ్‌కు చేరుకున్న నాలుగు జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాయి. క్వాలిఫయిర్-1లో భాగంగా మంగళవారం ముంబైలోని వాంఖడె స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, రైజింగ్ పూణె సూపర్ జెయింట్ జట్లు తలపడుతున్నాయి.

ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు

ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలుస్తుందా? లేక రైజింగ్ పూణె సూపర్ జెయింట్ గెలుస్తుందా? అనే దానిపై పెద్ద చర్చ జరుగుతోంది. ప్రధానంగా లీగ్ దశలో టాప్ ప్లేస్‌లో నిలిచిన ముంబై ఇండియన్స్ పైనల్స్‌కు చేరుకుంటుందా లేదా? అసలు ఐపీఎల్ చరిత్ర ఏం చెబుతుంది.

ఇక్కడ టాప్ రెండు స్థానాల్లో ఉన్న జట్లలో గెలిచిన జట్టు నేరుగా ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంటుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టుకు మరొక అవకాశం ఉంటుంది. ఇక్కడ ఓడిన జట్టు క్వాలిఫయర్-2లో ఆడే అవకాశం ఉంది. ఎలిమినేటర్ రౌండ్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్-1లో పరాజయం చెందిన జట్టు ఆడుతుంది.

Mumbai Indians might not win the tournament, says history

దీంతో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టాప్ 2 స్ధానాల్లో ఉన్న ముంబై ఇండియన్స్, రైజింగ్ పుణె సూపర్ జెయింట్‌లకు ఇది కచ్చితంగా అదనపు అవకాశమేనని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. పదో సీజన్‌లో లీగ్ దశలో 14 మ్యాచ్‌ల్లో 10 మ్యాచ్‌లు గెలిచి 20 పాయింట్లతో ముంబై ఇండియన్స్ అగ్రస్ధానంలో నిలిచింది.

9 మ్యాచ్‌ల్లో విజయంతో 18 పాయింట్లతో రైజింగ్ పూణె సూపర్ జెయింట్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ (17పాయింట్లు) మూడో స్థానంలో, కోల్‌కతా నైట్ రైడర్స్ (16 పాయింట్లు) నాలుగో స్ధానంలో నిలిచాయి. ఇదిలా ఉంటే లీగ్ దశలో టాప్‌ప్లేస్‌లో నిలిచిన జట్టు ట్రోఫీ గెలిచే అవకాశాలు లేవనేది ఐపీఎల్ చరిత్ర స్పష్టం చేస్తోంది.

2011లో ఐపీఎల్‌లో ప్లేఆఫ్ పద్ధతిని ప్రవేశపెట్టాక లీగ్ దశలో టాప్ ప్లేస్‌లో ఉన్న జట్టు టోర్నీ విజేతగా నిలిచిన సందర్భాలు లేవని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. దీంతో పాయింట్ల పట్టికలో ఉన్న ముంబై ఇండియన్స్ కూడా ట్రోఫీని గెలిచే అవకాశం లేదనే ఐపీఎల్ చరిత్ర చెబుతోంది. ఇప్పుడు ఈ చరిత్రను ముంబై తిరగరాస్తుందా లేదో తెలియాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే.

2011 నుంచి ఐపీఎల్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లను పరిశీలిస్తే..

* 2011: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(1) Vs చైన్నై సూపర్ కింగ్స్(2) - విజేత (చెన్నై)
* 2012: కోల్‌కతా నైట్‌రైడర్స్(2) Vs చైన్నై సూపర్ కింగ్స్(4) - విజేత (కోల్‌కతా)
* 2013: చైన్నై సూపర్ కింగ్స్(1) Vs ముంబై ఇండియన్స్(2) - విజేత (ముంబై)
* 2014: కింగ్స్ ఎలెవ్ పంజాబ్(1) Vs కోల్‌కతా నైట్‌రైడర్స్ (2) - విజేత (కోల్‌కతా)
* 2015: చైన్నై సూపర్ కింగ్స్(1) Vs ముంబై ఇండియన్స్(2)- విజేత(ముంబై)
* 2016: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(2) Vs సన్‌రైజర్స్ హైదరాబాద్(3)- విజేత (హైదరాబాద్)

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
According to IPL history, the table toppers, Mumbai Indians might not win the tournament this season. The team that has finished at the top after the league stage has never won the league since 2009. Rajasthan Royals is the only team to lift the trophy after finishing on top of the table in 2008. Mumbai will have to defy history to capture their third IPL title. MI will face RPS in the first qualifier at the Wankhede Stadium on Tuesday.
Please Wait while comments are loading...