క్రేజీ ఫ్యాన్: ధోనికి పాదాభివందనం, ఆట మధ్యలో ఆటోగ్రాఫ్‌

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: కెప్టెన్సీకి దూరమైనా మహేంద్ర సింగ్ ధోనికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. ధోని ఆటోగ్రాఫ్ కోసం ఓ అభిమానికి ఏకంగా మైదానంలోకి దూసుకొచ్చాడు. విజయ్ హజారే ట్రోఫీ క్వార్టర్‌ ఫైనల్లో ధోని బ్యాటింగ్‌ చేస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జార్ఖండ్, విదర్భ జట్ల మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఢిల్లీలోని ఎయిర్‌ ఫోర్స్‌ స్పోర్ట్‌ కాంప్లెక్స్‌ మైదానంలో జరిగింది. ధోని బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ఓ అభిమాని బౌండరీ అవతలున్న ఫెన్సింగ్‌ను దాటుకుని పిచ్‌ మధ్యలోకి వచ్చేశాడు.

Must-see pic: MS Dhoni signs autograph for a crazy fan while batting

అభిమాని రావడాన్ని చూసిన ధోని పరిస్థితిని అర్ధం చేసుకుని అతడికి ఆటోగ్రాఫ్ ఇచ్చి పంపించాడు. ఈ సమయంలో అతడు ధోనికి పాదాభివనందనం కూడా చేశాడు. అయితే ధోని ఆ అభిమానిపై ఎటువంటి కోపాన్ని ప్రదర్శించకపోవడం విశేషం.

దీంతో ఆ అభిమాని ఆనందానికి అవధుల్లేవు. రెండు నెలల కిందట ముంబైలో ఇంగ్లాండ్‌తో ప్రాక్టీస్‌ వన్డే సందర్భంగా కూడా ఓ అభిమాని పిచ్‌ మధ్యలోకి వచ్చి ధోని పాదాల్ని తాకిన సంగతి తెలిసిందే. మరోవైపు ధోని బ్యాటింగ్‌ చూడడం కోసం వచ్చిన ఫ్యాన్స్‌ 'ధోనీ ధోనీ' అంటూ నినాదాలు చేశారు.

ధోని సారథ్యంలోని జార్ఖండ్‌ జట్టు ఆరు వికెట్లతో విదర్భను ఓడించింది. ధోని ఈ మ్యాచ్‌ని సిక్సుతో ముగించడం విశేషం. జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విదర్భ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 159 పరుగులు చేసింది. అనంతరం జార్ఖండ్‌ జట్టు 45.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 165 పరుగుల లక్ష్యాన్ని చేధించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former India captain Mahendra Singh Dhoni gave a moment of a lifetime to a young fan during Vijay Hazare Trophy's quarter-final match against Vidarbha here on Wednesday (March 15).
Please Wait while comments are loading...