తప్పక చూడండి: ధోనిని ఇంటర్యూ చేసిన యువీ (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

ముంబై: అంతర్జాతీయ క్రికెట్‌లో సహచర ఆటగాళ్లుగా వారిద్దరూ ఎన్నో ఎత్తు పల్లాలను చూశారు. ఒకరంటే మరొకరికి ఎనలేని గౌరవం. ఇంతరీ వారిద్దరూ ఎవరంటే మహేంద్ర సింగ్ ధోని, యువరాజ్ సింగ్. కెప్టెన్‌గా ధోని సారథ్యంలో చివరి మ్యాచ్ ఆడిన యువీ 'కూల్ కెప్టెన్' పై ప్రశంసల వర్షం కరిపించాడు.

ధోని అత్యుత్తమ కెప్టెన్ అని, అతడి కెప్టెన్సీలో ఆడటం మరిచిపోలేని అనుభూతి అని యువీ పేర్కొన్నాడు. ముంబైలోని బ్రాబోర్న్‌ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో బుధవారం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ధోని కెప్టెన్సీలో యువరాజ్ సింగ్ ఆడాడు. ఈ వార్మప్ మ్యాచ్‌లో అంచనాలకు మించి రాణించారు.

స్లాగ్ ఓవ‌ర్ల‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ధోని తన‌దైన స్టైల్లో రెచ్చిపోయి ఆడాడు. అభిమానుల అంచ‌నాల‌ను ఏమాత్రం వ‌మ్ముచేయకుండా కేవ‌లం 40 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌ సాయంతో 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక యువ‌రాజ్ 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌ సాయంతో 56 ఫరుగులు చేశాడు.

మ్యాచ్ ముగిసిన అనంతరం యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనిలు సరదాగా మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో యువరాజ్ సింగ్ ఎంతో అప్యాయంగా ధోని భుజాలపై చేతులు వేసి మరీ అతడిని కొన్ని ప్రశ్నలు అడిగాడు.

rn rnrn

సోషల్ మీడియాలో వైరల్


ఈ వీడియో యువరాజ్ సింగ్ తన తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లలో పోస్టు చేయడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముందుగా టీమిండియాలో కెప్టెన్‌గా ప్రస్ధానం గురించి ధోనిని యువరాజ్ సింగ్ ప్రశ్నించాడు.

కెప్టెన్‌గా ప్రయాణం చాలా బాగుంది

కెప్టెన్‌గా ప్రయాణం చాలా బాగుంది


‘టీమిండియా కెప్టెన్‌గా ప్రయాణం చాలా బాగుంది. నీలాంటి ఆటగాళ్లు ఉండడంతో జట్టు సారథ్య బాధ్యతలు నాకు భారంగా అనిపించలేదు. పదేళ్లు సారథ్యాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాను. ఏదైతే అనుభూతిని పొందుతున్నానో దానిని చక్కగా ఎంజాయ్ చేశా' అని సమాధానం చెప్పాడు.

అందరి కంటే నువ్వే ఉత్తమ కెప్టెన్

అందరి కంటే నువ్వే ఉత్తమ కెప్టెన్


ఆ తర్వాత యువీ మాట్లాడుతూ ‘అందరి కంటే నువ్వే ఉత్తమ కెప్టెన్. నీ నాయకత్వంలో ఆడడం చాలా అద్భుతంగా అనిపించింది. మూడు మేజర్ టోర్నమెంట్లు, ప్రపంచకప్ గెలవడంతో పాటు టెస్టుల్లో టీమిండియాను నెంబర్ వన్‌గా నిలిపిన ఘనత నీదే' అని ధోనిపై ప్రశంసలు కురిపించాడు.

ఆరు సిక్సర్లు కొట్టడం మర్చిపోలేను

ఆరు సిక్సర్లు కొట్టడం మర్చిపోలేను


మధ్యలో ధోని జోక్యం చేసుకుని ‘నువ్వు ఆరు సిక్సర్లు కొట్టడం మర్చిపోలేను' అని అన్నాడు. తనకు ఈ అవకాశం ఇచ్చిన ధోనికి యువీ థ్యాంక్స్ చెప్పాడు. ఆ తర్వాత యువరాజ్ ఏమైనా అడగడం మర్చిపోయానా? అని అన్నాడు. దీనికి ధోని ఇక ఏమీ అడగొద్దన్నాడు.

కెప్టెన్సీ లేదు కాబట్టి ఎక్కువ సిక్సర్లు కొట్టగలవా?

కెప్టెన్సీ లేదు కాబట్టి ఎక్కువ సిక్సర్లు కొట్టగలవా?


ఇప్పుడు కెప్టెన్సీ లేదు కాబట్టి ఎక్కువ సిక్సర్లు కొట్టగలవా? అని ప్రశ్నించాడు. బంతి తన బౌలింగ్ ఎరీనాలోకి వచ్చి అన్ని అనుకూలిస్తే ఎక్కువ సిక్సర్లు బాదునని ధోని బదులిచ్చాడు. చాలా రోజుల తర్వాత యవరాజ్ సింగ్, ధోనిలు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకున్న ఈ వీడియో చూసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
They have seen several highs and lows in their international careers as team-mates. They have mutual respect for each other. It was again on view as one of them turned an interviewer.
Please Wait while comments are loading...