'దిల్‌స్కూప్‌' షాట్ ఎంతో పేరు తెచ్చింది: గర్వంగా ఉందన్న దిల్షాన్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: శ్రీలంక ఆల్ టైమ్ క్రికెట్ దిగ్గజాల్లో తిలకరత్నె దిల్షాన్ ఒకడు. ఆ జట్టు సాధించిన అనేక విజయాల్లో దిల్షాన్ కీలకపాత్ర పోషించాడు. ముఖ్యంగా భుజంపై తువ్వాలు వేసుకునే స్టైల్‌లో 'దిల్‌స్కూప్‌' షాట్‌‌ని క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసింది ఎవరో తెలుసా తిలకరత్నె దిల్షానే.

భారత్-శ్రీలంక జట్ల మధ్య టెస్టు సిరిస్‌ను పురస్కరించుకుని మంగళవారం మీడియాతో మాట్లాడాడు. క్రికెట్ చరిత్రలో ఒక షాట్‌కి ఓ శ్రీలంక ఆటగాడి పేరుండటం చాలా గర్వంగా ఉందని దిల్షాన్ ఆనందం వ్యక్తం చేశాడు. కెరీర్ ఆరంభంలో ఈ షాట్ ఆడేందుకు ప్రయత్నించలేదని, జట్టులో సుస్థిర స్ధానం దక్కించుకున్న తర్వాతే ప్రయోగాలు చేసినట్లు చెప్పాడు.

My team-mates called the Dilscoop ‘Starfish’: Tillakaratne Dilshan

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెటర్లకి దక్కని కొత్త తరహా షాట్‌ని కనిపెట్టిన గౌరవం తనకు దక్కినందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పాడు. 'సీరియస్‌గా చెప్పాలంటే ఈ దిల్‌స్కూప్ షాట్ నాపై ఇంత ప్రభావం చూపుతుందని నేను ఊహించలేదు. ఈ షాట్ వెలుగులోకి వచ్చిన తర్వాతే నాకు పేరొచ్చింది.. గర్వించేలా చేసింది' అని అన్నాడు.

'నేను తండ్రి అయిన తర్వాత నా పిల్లలకి మీ నాన్న పేరుతో ఒక క్రికెట్ షాట్ ఉందని చెప్తాను. చిన్నప్పుడు టెన్నిస్ బంతితో ఆడేటప్పుడు ఈ స్కూప్ షాట్‌ని నేను విరిగా ఆడేవాడ్ని. ఎందుకంటే.. కీపర్‌ వెనకవైపు తక్కువ దూరంలో బౌండరీ లైన్ ఉండేది. ఇక, టెన్నిస్ బంతి బాగా బౌన్స్ అయ్యేది' అని చెప్పుకొచ్చాడు.

అయితే శ్రీలంక జట్టులోకి వచ్చిన తర్వాత కనీసం నెట్స్‌లో కూడా ఈ షాట్‌ని ప్రాక్టీస్ చేయలేదని అన్నాడు. ఒకరోజు మ్యాచ్‌లో ఎందుకు దిల్‌స్కూప్ షాట్ ఆడకూడదు? అని ప్రశ్నించుకున్నానని, అంతే ఇక నాకు సౌకర్యమైన బంతి పడిన ప్రతిసారి ఆ షాట్ ఆడేశానని దిల్షాన్ చెప్పాడు.

ఇక ఈ షాట్ ఆడటంతో జట్టులోని సహచరులు దిల్షాన్‌ని 'స్టార్ ఫిష్' అని పేరు పెట్టారని తెలిపాడు. 'అలాంటి షాట్ ఆడుతున్నావు. నీకు నిజంగానే బ్రెయిన్ లేదు' అని పలుమార్లు తనతో అన్నట్లు చెప్పాడు. అయితే ఆ షాట్ అలా ఎందుకు ఆడావని తనని ఇప్పటివరకు ఎవరూ ప్రశ్నించలేదని అన్నాడు.

Dilscoop Shot : Sri Lankan opener Tillakaratne Dilshan's Best Cricket Shot Ever

తిలకరత్నే దిల్షాన్ శ్రీలంక తరుపున 330 వన్డేలు, 80 టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు. వన్డేల్లో పదివేలకు పైగా పరుగులు చేశాడు. 87 టెస్టులాడి 5492 పరుగులు నమోదు చేశాడు. తన కెరీర్‌లో ఆడిన చివరి మ్యాచ్‌లో దిల్షాన్ వికెట్‌ను సమర్పించుకున్నాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Many cricketers are remembered by moments but former Sri Lankan opener Tillakaratne Dilshan will always be remembered for his ‘patent’ scoop, fondly called the ‘Dilscoop’. Many a times, the Sri Lankan was seen going down on one knee, placing the face of the bat open and guiding the ball towards the third man area.
Please Wait while comments are loading...