ముంబై సాధన మొదలైంది: ఐపీఎల్‌ 10కి వాంఖడె సిద్ధం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: మంగళవారం (మార్చి 28)తో భారత్, ఆస్ట్రేలియాల మధ్య నాలుగు టెస్టులు బోర్డర్-గవాస్కర్ సిరిస్ ముగియనుంది. అంతేకాదు సిరిస్ విజేత ఎవరో కూడా తేలనుంది. ఆ తర్వాత ఏప్రిల్ 5 నుంచి ఐపీఎల్ పండుగ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 10వ సీజన్ కోసం విదేశీ ఆటగాళ్లు భారత్‌కు చేరుకుంటున్నారు.

భారత్‌కు చెందిన ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంటున్నారు. హైదరాబాద్‌లో ఏప్రిల్ 4న ఐపీఎల్‌ 10వ సీజన్ ఆరంభ వేడుకలు జరగనున్నాయి. ఢిపెండింగ్ ఛాంపియన్స్ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రన్నర్స్ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య ఏప్రిల్‌ 5న ఉప్పల్ స్టేడియంలో తొలి మ్యాచ్‌ జరగనుంది.

ఆ మరుసటి రోజైన ఏప్రిల్‌ 6న ముంబై ఇండియన్స్‌, రైజింగ్‌ పూణె జెయింట్‌ మధ్య రాత్రి 8గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ముంబై ఆటగాళ్లు ఐపీఎల్‌ కోసం ఇప్పటికే ప్రాక్టీసు మొదలుపెట్టేశారు. సుమారు 3రోజుల నుంచి ముంబై ఆటగాళ్లు సాధనలో పాల్గొంటున్నారు.

ఇందులో భాగంగా సోమవారం నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్‌కు ఆ జట్టు యజమాని నీతా అంబానీ వచ్చారు. ఈ సందర్భంగా జట్టు కోచ్‌, మాజీ క్రికెటర్ రాబిన్ సింగ్‌తో పాటు ఆటగాళ్లతో కాసేపు ఆమె ముచ్చటించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Mumbai Indians team owner Neeta Ambani along with coach Mahela Jayawardene during a practice session in Mumbai on Sunday.
Please Wait while comments are loading...