ఫైనల్లో నో బాల్: బుమ్రాని చాలా కాలం బాధిస్తుందన్న సన్నీ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ ఓటమికి కారణమైన నో బాల్ చాలా కాలం పాటు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రాని వేధిస్తుందని టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్యూలో ఈ విషయాన్ని ప్రస్తావించాడు.

'ఈ టోర్నమెంట్ ఆద్యంతం బూమ్రా అద్భుతమైన బౌలింగ్ వేశాడు. అయితే దురదృష్టవశాత్తూ ఫైనల్లో నో బాల్ వేయడం అతన్ని చాలాకాలం బాధిస్తుంది. ఆ ఓటమి పాకిస్తాన్‌పై కాబట్టి ఆ నో బాల్ వేదన చాలా ఎక్కువగా ఉంటుంది' అని గవాస్కర్ పేర్కొన్నాడు.

No-Ball Will Haunt Jasprit Bumrah For A Long Time, Says Sunil Gavaskar

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్ చేతిలో టీమిండియా ఓటమికి బుమ్రా వేసిన నో బాల్ కూడా ఓ కారణం. బుమ్రా వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవ‌ర్ తొలి బంతికే పేసర్ బుమ్రా పాక్ ఓపెన‌ర్ ఫ‌క‌ార్ జ‌మాన్‌ను అవుట్ చేశాడు. ఆ సమయంలో ఫకార్ వ్యక్తిగత స్కోరు 3 పరుగులు.

అయితే అది కాస్త నో బాల్ కావడంతో అతడికి లైఫ్ వచ్చింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఫకార్ జమాన్ తన తొలి వన్డే సెంచరీతో చెలరేగడంతో పాటు పాకిస్థాన్‌ను పటిష్ట స్థితిలో నిలిపాడు. దీంతో నోబాల్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. ఫైనల్లో భారత్ ఓటమికి బూమ్రా బౌలింగ్ కారణమైందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former India captain Sunil Gavaskar reckoned that the no-ball bowled by Jasprit Bumrah during the final of the ICC Champions Trophy 2017 against Pakistan will haunt him for a long time.
Please Wait while comments are loading...