కోహ్లీ, డివిల్లీర్స్ డకౌట్ అందుకే: చిక్కుల్లో పాక్ లేడీ జర్నలిస్టు

Posted By:
Subscribe to Oneindia Telugu

లండన్: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, దక్షిణాఫ్రికా కెప్టెన్ ఎబి డివిల్లీర్స్ డకౌట్ కావడం ఓ పాకిస్తాన్ లేడీ జర్నలిస్టును కష్టాల్లోకి నెట్టింది. ప్రపంచంలో వారిద్దరు మేటి బ్యాట్స్‌మెన్ అనే విషయం అందరికీ తెలిసిందే. పైగా, 2014 తర్వాత కోహ్లీ డకౌట్ అయిన సందర్భం ఇదే.

వారిద్దరు డకౌట్ కావడం ఓ పాకిస్తాన్ మహిళా జర్నలిస్టుకు కష్టాలను తెచ్చి పెట్టింది. క్రికెట్ అభిమానులు ఆమెపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా పాకిస్తాన్ స్పోర్ట్స్ రిపోర్టర్ జైనాబ్ అబ్బాస్ విరాట్ కోహ్లీ, డివిల్లీర్స్‌తో సెల్ఫీలు దిగారు.

Pak lady journalist in troble

ఆ సెల్ఫీలు చూసుకుని ఆమె సంబరపడిపోయి ఉంటుంది. కానీ ఆ తర్వాతే ఆమెకు కష్టాలు వచ్చి పడ్డాయి. ఆమెతో సెల్ఫీలకు ఫోజులిచ్చిన ఇద్దరు మేటి బ్యాట్స్‌మెన్ కూడా డకౌట్ అయ్యారు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచులో డివిల్లీర్స్ డకౌట్ కాగా, శ్రీలంకతో జరిగిన మ్యాచులో కోహ్లీ డకౌట్ అయ్యాడు.

దాంతో సోషల్ మీడియాలో జైనాబ్‌ను తప్పు పడుతూ వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. కోహ్లీ నాలుగు డెలివరీలు ఆడి, పరుగులేమీ చేయకుండా నువాన్ ప్రదీప్ చేతిలో అవుటయ్యాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A pakistan journalist hs been attacked by the netizens relating to the duck outs of Virat Kohli and AB Devilliers.
Please Wait while comments are loading...