భారత్‌పై పాక్ విజయం: షాహిద్ అప్రిది ఏమన్నాడో తెలుసా?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌పై పాకిస్థాన్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌లోని క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసిన ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న పాక్‌పై పలువురు అంతర్జాతీయ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.

'థాంక్యూ జెంటిల్‌ మ్యాన్': పాకిస్థానీయుల మనసు గెలిచిన కోహ్లీ

అయితే భారత్‌పై ఘన విజయం సాధించిన సందర్భంగా ఆ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అప్రిది హర్షం వ్యక్తం చేశాడు. పనిలో పనిగా ఐసీసీకి ఓ మెసేజ్ కూడా ఇచ్చాడు. భారత్, పాక్ మధ్య మరిన్ని మ్యాచ్‌లు జరిగేలా దృష్టి సారించాలని సూచించాడు. ఇందుకు భారత ప్రభుత్వం సహకరించాలని చెప్పాడు.

Pakistan cricket back on track after ICC Champions Trophy win: Shahid Afridi

2011లో మొహాలీలో జరిగిన వరల్డ్ కప్‌ సెమీ ఫైనల్ మ్యాచ్‌కు తాను కెప్టెన్‌గా వ్యవహరించానని, తనకు ఇరు దేశాల మధ్య జరిగే మ్యాచ్ ప్రాముఖ్యత ఏంటో తెలుసని అన్నాడు. ఇరు దేశాల మధ్య శాంతిని పెంపొందించడంలో క్రికెట్ కీలక పాత్ర పోషిస్తుందని అప్రిది అన్నాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్: భారత ఓటమికి ప్రధాన కారణం

ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను కూడా కొంత వరకూ తగ్గు ముఖం పట్టాలని, శాంతి భావంతో మెలగాలని కోరుకుంటున్నట్లు అఫ్రిది ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
This is one victory that Pakistan fans will remember for long. It has been an ultra-quick turnaround from no-hopers to champions for the Pakistan players and the manner in which the team won the match was really impressive.
Please Wait while comments are loading...