మొహాలిలో హీరో పార్ధీవ్: 12ఏళ్లకు అర్ధసెంచరీ, 14ఏళ్లకు తొలి సిక్స్

Posted By:
Subscribe to Oneindia Telugu

మొహాలి: 8ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేసిన వికెట్ కీపర్ పార్ధీవ్ పటేల్ తనకు అందివచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాడు. భారత టెస్టు జట్టులో సుదీర్ఘ కాలం తర్వాత జట్టులో చోటు సంపాదించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

మూడో టెస్టులో బ్యాటింగ్‌తో పాటు కీపింగ్‌లో కూడా అద్భుతంగా రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 85 బంతులు ఎదుర్కొని 42 పరుగులు చేసి ఫర్వాలేదనిపించిన పార్ధీవ్ పటేల్, రెండో ఇన్నింగ్స్‌లో చెలరేగిపోయి ఆడాడు. టెస్టు మ్యాచ్‌ని వన్డే మాదిరి ఆడి తన కసి మొత్తాన్ని ఇంగ్లాండ్ బౌలర్లపై చూపించాడు.

54 బంతులను ఎదుర్కొని 67 పరుగులు చేసిన పార్ధీవ్ పటేల్ విన్నింగ్ షాట్ కొట్టడంతో పాటు జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ క్రమంలో పార్ధీవ్ పటేల్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 39 బంతుల్లో అర్ధసెంచరీ సాధించి 12 ఏళ్ల తరువాత టెస్టుల్లో అర్ధసెంచరీని సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

సుదీర్ఘ విరామం తర్వాత అర్ధ సెంచరీ

సుదీర్ఘ విరామం తర్వాత అర్ధ సెంచరీ

అంతేకాదు భారత జట్టు తరుపున టెస్టుల్లో సుదీర్ఘ విరామం తర్వాత అర్ధ సెంచరీ చేసింది కూడా పార్ధీవ్ పటేలే కావడం విశేషం. 2004 అక్టోబర్ లో చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో పార్థీవ్(54) చివరిసారి అర్ధ సెంచరీని సాధించాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ఇంగ్లాండ్‌పై అర్ధసెంచరీ సాధించి సత్తా చాటాడు.

67 పరుగుల్లో సిక్స్ కొట్టడం

67 పరుగుల్లో సిక్స్ కొట్టడం

తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగులు చేసిన పార్థీవ్, రెండో ఇన్నింగ్స్‌లో 67 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇక్కడ ఇంకో విశేషం ఏమిటంటే 67 పరుగుల్లో సిక్స్ కొట్టడం. తన 14ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో పార్ధీవ్ పటేల్ మొహాలి టెస్టులో తొలి సిక్సర్ సాధించాడు. ఇంగ్లాండ్ బౌలర్ రషిద్ వేసిన 13ఓవర్ మూడో బంతికి పార్థీవ్ సిక్స్ సాధించాడు.

తొలిసారి మొహాలి టెస్టులో సిక్స్

తొలిసారి మొహాలి టెస్టులో సిక్స్

ఇప్పటివరకు టెస్టుల్లో 110 ఫోర్లు బాదిన పార్ధీవ్ తొలిసారి మొహాలి టెస్టులో సిక్స్ కొట్టాడు. 2002లో అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లోకి పార్థీవ్ అరంగేట్రం చేసిన ఇప్పటివరకూ సిక్స్ కొట్టకపోవడం విశేషం. మొహాలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 103 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఏడు పరుగులకే ఓపెనర్ మురళీ విజయ్ వికెట్‌ను కోల్పోయింది.

భారత్‌ విజయంలో పార్ధీవ్ కీలకపాత్ర

భారత్‌ విజయంలో పార్ధీవ్ కీలకపాత్ర

ఈ క్రమంలో పుజారా (25), విరాట్‌కోహ్లీ (6 నాటౌట్‌)లతో చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పిన పార్ధీవ్ పటేల్ భారత్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. 39 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 50 వికెట్లు తీసిన కీపర్‌గా రికార్డు సాధించిన పార్థివ్ రెండో ఇన్నింగ్స్‌లోనూ చక్కటి క్యాచ్‌లు అందుకున్నాడు.

తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని అద్భుతమైన క్యాచ్

తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని అద్భుతమైన క్యాచ్

రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ బెయిర్‌స్టో ఆడిన బంతి నేలపై చాలా తక్కువ ఎత్తులోనే వచ్చినప్పటికీ దానిని అద్భుతమైన క్యాచ్ రూపంలో అందుకున్నాడు. ఈ క్యాచ్‌పై కామెంటేటర్లు పార్థివ్‌ను ప్రశంసించగా, అది పార్థివ్‌ హైట్‌కు సరిపడే ఎత్తులోనే వచ్చిందని నెటిజన్లు సెటైర్లు వేశారు.

పార్థివ్ పటేల్ చక్కటి బ్యాటింగ్, కీపింగ్

పార్థివ్ పటేల్ చక్కటి బ్యాటింగ్, కీపింగ్

భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, జడేజా, జయంత్ యాదవ్‌ల ఆల్‌రౌండర్ ప్రదర్శనకు తోడుగా పార్థివ్ పటేల్ చక్కటి బ్యాటింగ్, కీపింగ్ నైపుణ్యాలు తోడవడటంతో మొహాలీ టెస్టులో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐదు వన్డేల సిరిస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Parthiv Patel made a Test comeback against England after around eight years.
Please Wait while comments are loading...