గంట ముందు వికెట్ పడి ఉంటే: రాంచీ టెస్టు ఫలితం మరోలా!

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: రాంచీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్ చివరకు డ్రాగా ముగిసింది. రాంటీ టెస్టు ఆస్ట్రేలియాకు 800వ టెస్టు. ఈ టెస్టులో ఓటమి అంచు నుంచి ఆస్ట్రేలియా తప్పించుకుని టెస్టును డ్రాగా ముగించుకుంది.

దీంతో అందరి దృష్టి మార్చి 25 నుంచి ధర్మశాలలో ప్రారంభం కానున్న నాలుగో టెస్టుపై పడింది. నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరిస్‌లో ఇరు జట్లు చెరో టెస్టుని గెలిచి 1-1తో సమంగా ఉన్నాయి. అంతేకాదు ఇప్పటివరకు జరిగిన మూడు టెస్టుల్లో ఐదు రోజుల ఆట జరిగింది ఒక్క రాంచీ టెస్టులోనే.

పూణె టెస్టు, బెంగుళూరు టెస్టులు నాలుగు రోజులకే ముగిసిన సంగతి తెలిసిందే. మూడో టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 451 పరుగులు చేసింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ 178 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. భారత బౌలర్‌ రవీంద్ర జడేజా ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీశాడు.

ఓపెనర్లు చక్కటి శుభారంభం

ఓపెనర్లు చక్కటి శుభారంభం

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్‌(67), మురళీ విజయ్‌(82) చక్కటి శుభారంభాన్నిచ్చారు. తొలి రోజు ఆటలో భుజం నొప్పితో కోహ్లీ మైదానాన్ని వీడాడు. భుజం నొప్పి కారణంగా కోహ్లీ రెండో రోజు కూడా విశ్రాంతి తీసుకున్నాడు. దీంతో కోహ్లీ బ్యాటింగ్‌పై సందిగ్ధత నెలకొంది. అయితే గాయం నుంచి కోలుకున్న కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌లో నిరాశపరిచాడు. 6 పరుగుల వద్ద కమ్మిన్స్‌ బౌలింగ్‌లో స్మిత్‌కి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పుజారా 202, వృద్ధిమాన్ సాహా 117 పరుగులతో అద్భుతంగా రాణించి తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను ఆధిక్యంలో నిలిపారు.

603/9 పరుగుల వద్ద భారత్ డిక్లేర్‌

603/9 పరుగుల వద్ద భారత్ డిక్లేర్‌

ఇక చివర్లో వచ్చిన జడేజా ఆసీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్ని 55 బంతుల్లో 54 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో భారత్‌ తన తొలి ఇన్నింగ్స్‌ను 603/9 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. అంతేకాదు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌పై 152 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఆసీస్‌ 210 ఓవర్లు బౌలింగ్‌ చేసినా భార‌త్‌ను ఆలౌట్‌ చేయలేకపోయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 7.2 ఓవర్లలో 2 వికెట్లకు 23 పరుగులు చేసింది. వార్నర్ (14), లియాన్ (2) విఫలమయ్యారు. రెన్‌షా 7 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

23/2 ఓవర్‌ నైట్‌ స్కోరుతో చివరి రోజు

23/2 ఓవర్‌ నైట్‌ స్కోరుతో చివరి రోజు

చివరిరోజు ఆట మాత్రమే మిగిలున్న మ్యాచ్‌లో ప్రస్తుతం ఆస్ట్రేలియా 129 పరుగులు వెనుకబడి ఉంది. ఆసీస్ చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. 23/2 ఓవర్‌ నైట్‌ స్కోరుతో చివరి రోజు ఆట ప్రారంభించిన ఆసీస్‌ తొలి సెషన్‌ చివర్లో తడబడింది. స్వల్ప వ్యవధిలోనే రెన్‌షా (15), స్మిత్‌ (21)ను అవుట్ చేయడంతో విజయం దాదాపు టీమిండియాదేనని అందరూ భావించారు. భారత గెలుపును ఆసీస్ బ్యాట్స్‌మన్ పీటర్ హ్యాండ్స్‌కోంబ్, షాన్ మార్ష్ అడ్డుకున్నారు. సుదీర్ఘంగా బ్యాటింగ్ చేసి కోహ్లీ సేనకు కఠిన పరీక్ష పెట్టారు.

భార‌త బౌల‌ర్ల‌ను దీటుగా ఎదుర్కొన్న హ్యాండ్స్ కోంబ్, మార్ష్

భార‌త బౌల‌ర్ల‌ను దీటుగా ఎదుర్కొన్న హ్యాండ్స్ కోంబ్, మార్ష్

62 ఓవ‌ర్ల పాటు భార‌త బౌల‌ర్ల‌ను దీటుగా ఎదుర్కొన్నారు. ఐదో వికెట్‌కు 124 పరుగులు జోడించారు. రెండు సెష‌న్ల పాటు ఈ ఇద్ద‌రూ వికెట్ ఇవ్వ‌కుండా భార‌త బౌల‌ర్ల స‌హనాన్ని ప‌రీక్షించారు. టెస్టు ర్యాంకుల్లో నెంబర్ వన్ స్ధానంలో ఉన్న రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు ఈ జోడీని విడదీసేందుకు తెగ కష్టపడ్డారు. చివరి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 6 వికెట్లకు 204 పరుగులు చేసింది. ఆసీస్ ఆటగాడు పీటర్ హ్యాండ్స్ కోంబ్ 72 పరుగులతో అజేయంగా క్రీజులో ఉన్నాడు. దీంతో నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమానంగా ఉన్నాయి.

డ్రా చేసుకున్న విదేశీ జట్టు ఆస్ట్రేలియానే

డ్రా చేసుకున్న విదేశీ జట్టు ఆస్ట్రేలియానే

2010 తర్వాత భారత గడ్డపై తొలి ఇన్నింగ్స్‌లో వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌లో టెస్టుని డ్రా చేసుకున్న విదేశీ జట్టు ఆస్ట్రేలియానే కావడం విశేషం. ఈ సిరీస్‌లో చివరి టెస్టు ఈ నెల 25న ధర్మశాలలో ప్రారంభం కానుంది. రెండో ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా నాలుగు, అశ్విన్, ఇషాంత్ శర్మ చెరో వికెట్ తీశారు. ఐదో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 6 వికెట్లకు 204 రన్స్ చేసింది. హ్యాండ్స్ కాంబ్ 72 రన్స్ తో అజేయంగా నిలిచాడు. వీరిలో ఒక్కరైనా ఒక గంట ముందుగా అవుటై ఉంటే రాంచీ టెస్టు ఫలితం మరోలా ఉండేది. ఈ టెస్టులో టీమిండియా తప్పక విజయం సాధించేది.

ఒక గంట ముందు వికెట్ పడి ఉంటే ఫలితం మరోలా

ఒక గంట ముందు వికెట్ పడి ఉంటే ఫలితం మరోలా

అయితే ఇంకా 7 ఓవర్లు మాత్రమే మిగిలి ఉన్నాయనగా షాన్ మార్ష్‌ను జడేజా పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత వెంటనే క్రీజ్‌లోకి వచ్చిన మాక్స్‌వెల్‌ను అశ్విన్ ఔట్ చేశాడు. కానీ మరో పది ఓవర్లు టీమిండియా చేతిలో ఉండి ఉంటే ఆలౌట్ చేసే అవకాశాలుండేవి. ఈ మ్యాచ్ డ్రాగా ముగియడంతో నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 1-1తో ఇరు జట్లు సమంగా నిలిచాయి. సిరీస్ విజేతను తేల్చే ఆఖరి టెస్ట్ మ్యాచ్ 25 నుంచి ధర్మశాలలో మొదలుకానుంది. 2010 తర్వాత భారత గడ్డపై తొలి ఇన్నింగ్స్ లో వెనుకబడి చివరికి మ్యాచ్ డ్రా చేసుకున్న విదేశీ జట్టు ఆస్ట్రేలియానే. డబుల్ సెంచరీ చేసిన పుజారకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
PETER Handscomb and Shaun Marsh have engineered one of the great saves in Australian Test history to push an all-time epic series to a thrilling decider.
Please Wait while comments are loading...