పిచ్ మధ్యలోకి ఫ్యాన్: కాళ్లకు మొక్కాడు, పిలిచి షేక్ హ్యాండ్ ఇచ్చిన ధోని

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: బ్రాబోర్న్ స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి వార్మప్ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తన కెరీర్‌లోనే కెప్టెన్‌గా ఆఖరి మ్యాచ్ ఆడుతున్న మహేంద్ర సింగ్ ధోనిని చూసేందుకు క్రికెట్ అభిమానులు పోటెత్తారు.

వార్మప్ మ్యాచ్ అయినప్పటికీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మ్యాచ్‌కు పెద్ద ఎత్తున అభిమానులు హాజరయ్యారు. ఈ మ్యాచ్‌లో తెలుగు తేజం అంబటి రాయుడు సెంచరీ నమోదు చేసిన ధోని క్రీజులోకి వచ్చాడు. ఈ సమయంలో స్టేడియంలోని అభిమానులంతా లేచి నిల్చుని సాదర స్వాగతం పలికారు.

స్టాండ్స్ నుంచి దూకి, పిచ్ వద్దకు పరిగెత్తుకొచ్చిన అభిమాని

స్టాండ్స్ నుంచి దూకి, పిచ్ వద్దకు పరిగెత్తుకొచ్చిన అభిమాని

ఈ సందర్భంగా ధోని ధోని అంటూ పెద్ద ఎత్తున అరుపులు కేకలతో నినాదాలు చేశారు. 40.1 ఓవర్ల వద్ద క్రీజులోకి వచ్చి ధోని యువీతో జతకలిశాడు. అనంతరం ఆకాశమే హద్దుగా ధోని చెలరేగి ఆడుతున్నాడు. ఇదే సమయంలో ఆట మధ్యలో ధోనీ అభిమాని ఒకరు స్టాండ్స్ నుంచి దూకి, పిచ్ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చాడు.

అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది

అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది

దీంతో వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అతడిని పట్టుకునేందుకు పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పటికే క్రీజులో ఉన్న ధోనిని సమీపించబోయే క్షణంలో అతడిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో తనకు కొంచెం దూరం వరకు వచ్చిన అభిమానిని దగ్గరకు పిలిచి షేక్ హ్యాండ్ ధోని ఇచ్చాడు.

ధోని కాళ్లకు మొక్కిన అభిమాని

ధోని కాళ్లకు మొక్కిన అభిమాని

దీంతో సంతోషానికి గురైన అతడు ధోని కాళ్లకు మొక్కాడు. ఇంతలో సెక్యూరిటీ సిబ్బంది అతడిని తీసుకుని గ్రౌండ్ వెలుపలకు తీసుకుపోయారు. ఈ మ్యాచ్‌లో ధోని 40 బంతులను ఎదుర్కొని 8 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 68 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ధోని సేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దీంతో భారత ఏ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లను నష్టపోయి 304 పరుగులు చేసింది. మరోవైపు ధోని గౌరవార్ధం ఈ మ్యాచ్‌కు హాజరయ్యే అభిమానులకు ఫ్రీ ఎంట్రీ కల్పించింది.

పది వేల మంది అభిమానులకు ఉచిత పాస్‌లు

పది వేల మంది అభిమానులకు ఉచిత పాస్‌లు

సుమారు పది వేల మంది అభిమానులకు ఉచిత పాస్‌లను ఇచ్చింది. ఇంగ్లాండ్, భారత్ ఏ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు చివరిసారిగా ధోని కెప్టెన్‌గా వ్వవహరిస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 15న మొదలయ్యే వన్డే సిరీస్‌కు సన్నాహకంగా భారత్ ఏ, ఇంగ్లాండ్ లెవెన్‌ జట్లు రెండు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడుతున్నాయి.

తొలి డే అండ్ నైట్‌ మ్యాచ్‌లో కెప్టెన్‌గా ధోని

మంగళవారం జరిగే తొలి డే అండ్ నైట్‌ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్‌ ధోని కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, గురువారం ఇదే స్టేడియంలో జరిగనున్న మ్యాచ్‌కి అజింక్యా రహానె భారత ఏ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇయాన్‌ మోర్గాన్‌ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు ఈ వార్మప్ మ్యాచ్ బరిలోకి దిగుతోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
As Mahendra Singh Dhoni captains the Indian side for one last time on Tuesday (Jan 10), an enthusiastic MS Dhoni fan breached the security cordon and rush towards cricket pitch to touch Captain Cool's feet.
Please Wait while comments are loading...