ఇంటర్నెట్‌లో వైరల్: పెళ్లి బట్టల్లో యువరాజ్, కీచ్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Oneindia Telugu

మొహాలి: టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ బుధవారం వైవాహిక జీవితంలో అడుగుపెట్టాడు. బాలీవుడ్‌ నటి, మోడల్‌ హజెల్‌ కీచ్‌తో యువీ వివాహ కార్యక్రమం సంప్రదాయ బద్దంగా మొదలైంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులతో యువీ, కీచ్ పెళ్లి దుస్తుల్లో చండీగఢ్‌లో ఉన్న ఫతేగడ్‌లోని గురుద్వారా చేరుకున్నారు.

యువీకి భజ్జీ శుభాకాంక్షలు

బాలీవుడ్‌ నటి, మోడల్‌ హజెల్‌ కీచ్‌తో యువీ వివాహం జరిగింది. ఈ సందర్భంగా నూతన దంపతులకు టీమిండియా స్ఫిన్నర్ హార్భజన్ సింగ్ శుభాకాంక్షలు తెలిపాడు.

అంగరంగ వైభవంగా

అంగరంగ వైభవంగా

గురుద్వారాలో యువరాజ్, హాజెల్ కీచ్‌ల అంగరంగ వైభవంగా జరిగింది. నూతన వధూవరులు పెళ్లి దుస్తుల్లో మెరిసిపోయారు. మెరూన్‌, బంగారు వర్ణంలోని షేర్వాణీలో యువరాజ్ కత్తి చేతబట్టి రాజసం ఉట్టిపడింది. ఇక వధువు హజెల్‌కీచ్‌ రిచ్‌ డిజైనరీ లెహంగాతో అందంగా నగలు అలంకరించుకొని ఉంది.

ఇంటర్నెట్‌లో ప్రత్యేక ఆకర్షణ

ఇంటర్నెట్‌లో ప్రత్యేక ఆకర్షణ

వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రస్తుతం యువరాజ్, హాజెల్ కీచ్ పెళ్లి ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌, సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. యువరాజ్‌ తల్లి షబ్నం సింగ్‌ ఎక్కువగా దర్శించే గురుద్వారాలో సిక్కు సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరిగింది.

ఘనంగా మెహందీ, సంగీత్ వేడుక

ఘనంగా మెహందీ, సంగీత్ వేడుక

యువరాజ్ వివాహ వేడుకలో భాగంగా మంగళవారం మెహందీ, సంగీత్ వేడుకను ఘనంగా నిర్వహించారు. మెహందీ, సంగీత్‌ కార్యక్రమాలకు టీమిండియా హాజరైంది. ఈ కార్యక్రమాల్లో యువరాజ్‌, హాజెల్‌ కీచ్‌ సందడి చేశారు. టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్‌కోహ్లీ, జట్టు సభ్యులతో కలిసి యువీ వేసిన భాంగ్రా స్టెప్పులతో అదరగొట్టారు.

డిసెంబర్ 2న గోవాలో హిందూ సంప్రదాయం ప్రకారం

డిసెంబర్ 2న గోవాలో హిందూ సంప్రదాయం ప్రకారం

బుధవారం చండీగఢ్‌లో సిక్కు సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరగ్గా డిసెంబర్ 2న గోవాలో హిందూ సంప్రదాయం ప్రకారం మరోసారి వివాహం జరిపించనున్నారు. ఈ కార్యక్రమానికి వధూవరుల కుటుంబసభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరుకానున్నారు. డిసెంబర్ 5న చత్తార్‌పూర్‌లో సంగీత్, 7న ఢిల్లీలోని ఓ హోటల్‌లో రిసెప్షన్ జరుగనుంది.

ఇంటర్నెట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన యువీ, కీచ్ పెళ్లి ఫోటోలు

చంఢీగడ్‌లోని గురుద్వారాలో యువరాజ్, హాజెల్ కీచ్‌ల అంగరంగ వైభవంగా జరిగింది. నూతన వధూవరులు పెళ్లి దుస్తుల్లో మెరిసిపోయారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The stylish-left-handed batsman has shared his images dressed as a groom. Yuvraj is getting married to model-turned-actress Hazel Keech today (Nov 30) in Chandigarh.
Please Wait while comments are loading...