దయచేసి పాక్‌లో ఆడేందుకు రండి: భారత్‌పై విజయం తర్వాత పాక్ కెప్టెన్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: 'ఈరోజు లేదా రేపు కాదు... ఈ విజయం పాకిస్థాన్ చరిత్రలో చాలా సంవత్సరాలపాటు గుర్తుండిపోతుంది' మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలివి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌పై విజయం సాధించిన తర్వాత సర్ఫరాజ్ మీడియాతో మాట్లాడాడు.

'థాంక్యూ జెంటిల్‌ మ్యాన్': పాకిస్థానీయుల మనసు గెలిచిన కోహ్లీ

ఇకనైనా పాకిస్థాన్‌లో క్రికెట్ ఆడేందుకు ప్రపంచంలోని మిగతా దేశాలు ముందుకు రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశాడు. 2009లో లాహోర్‌లో శ్రీలంక జట్టుపై ఉగ్రవాద దాడి అనంతరం ఏ పెద్ద క్రికెట్‌ జట్టు కూడా పాకిస్థాన్‌లో ఆడేందుకు ముందుకు రాని సంగతి తెలిసిందే.

మా ఆటగాళ్లు గొప్ప విజయాన్ని సాధించారు

మా ఆటగాళ్లు గొప్ప విజయాన్ని సాధించారు

‘మా ఆటగాళ్లు గొప్ప విజయాన్ని సాధించారు. ఈ క్రెడిట్‌ అంతా వారిదే. ఈ అద్భుత విజయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుంటారు. చరిత్రలో ఎన్నో ఏళ్లు ఇది నిలిచిపోతుంది. గొప్ప ప్రేరణ ఇచ్చేవిధంగా మా ఆటగాళ్లు ఆడారు. ఎనిమిదో ర్యాంకు జట్టుగా అడుగుపెట్టి మేం టోర్నమెంటును కైవసం చేసుకున్నాం. ఇప్పటికైనే అన్నిదేశాలు ముందుకొచ్చి పాకిస్థాన్‌లో క్రికెట్‌ ఆడుతాయని ఆశిస్తున్నాం' అని సర్ఫరాజ్‌ పేర్కొన్నాడు.

ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు

ఇప్పటికీ నమ్మశక్యంగా లేదని చెప్పాడు. ఈ విజయాన్ని పాకిస్థాన్ ప్రజలకు అంకితమిస్తున్నట్లు చెప్పాడు. పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌)తో తాము గణనీయంగా లబ్ధి పొందినట్టు చెప్పాడు. తమ కెరీర్‌లో తొలి ఐసీసీ టోర్నీలు ఆడుతున్న హసన్ అలీ, ఫకార్ జమాన్‌లు అద్భుత ప్రదర్శన చేశారని కొనియాడాడు.

హఫీజ్, ఆమీర్ బౌలింగ్‌పై కూడా సర్ఫరాజ్ ప్రశంసలు

హఫీజ్, ఆమీర్ బౌలింగ్‌పై కూడా సర్ఫరాజ్ ప్రశంసలు

ఇక సీనియర్ ఆటగాళ్లు అయిన మహ్మద్ హఫీజ్, ఆమీర్ బౌలింగ్‌పై కూడా సర్ఫరాజ్ ప్రశంసలు కురిపించాడు. కొంతకాలంగా పాక్‌ క్రికెట్‌ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నదని తెలిపాడు. ‘కొన్నేళ్లుగా స్వదేశీ మ్యాచులు మేం దుబాయ్‌లో ఆడుతూ వస్తున్నాం. అందువల్ల మిగతా జట్లకు ఉన్నట్టు మాకు స్వదేశీ అనుకూలత ఎప్పుడూ లభించలేదు. ఈ విజయం వల్లనైనా మిగతా జట్లు పాక్‌ వచ్చి క్రికెట్‌ ఆడుతాయని ఆశిస్తున్నాం' అని సర్ఫరాజ్‌ చెప్పాడు.

180 పరుగుల తేడాతో భారత్‌పై విజయం

180 పరుగుల తేడాతో భారత్‌పై విజయం

పైనల్‌కి ముందు టీమిండియా అన్ని రంగాల్లో పాకిస్థాన్ కంటే మెరుగ్గా ఉన్నప్పటికీ పైనల్లో బౌలర్లు తేలిపోవడంతో పాకిస్థాన్ చేతిలో చిత్తుగా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది. అనంతరం 339 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 30.3 ఓవర్లకు గాను 158 పరుగులు చేసిన ఆలౌటైంది. దీంతో భారత్‌పై 180 పరుగుల తేడాతో పాక్ ఘన విజయం సాధించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
"Not just today, not just tomorrow, this day will be remembered in Pakistan for years to come," said a beaming Pakistan captain Sarfraz Ahmed as he made a passionate plea to other nations to play international cricket in their country.
Please Wait while comments are loading...