న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20 వరల్డ్ కప్ విజేత భారత్: మోడీతో సహా ఎవరేమన్నారు?

అంధుల టీ20 వరల్డ్ కప్‌లో రెండోసారి ఛాంపియన్‌గా అవతరించిన భారత్‌ను ప్రధాన నరేంద్ర మోడీతో పలువురు అభినందనలు తెలిపారు.

By Nageshwara Rao

హైదరాబాద్: అంధుల టీ20 వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియా తన టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన పైనల్స్‌లో దాయాది దేశమైన పాకిస్థాన్‌పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించి భారత్ విశ్వవిజేతగా నిలిచింది.

<strong>అంధుల టీ20 వరల్డ్‌కప్ విజేత భారత్: పాక్‌పై ఘన విజయం</strong>అంధుల టీ20 వరల్డ్‌కప్ విజేత భారత్: పాక్‌పై ఘన విజయం

తద్వారా రెండోసారి టైటిల్‌ను సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. అంతకుముందు 2012 టోర్నీలోనూ భారత ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించి మొట్టమొదటిసారి వరల్డ్‌కప్‌ను సాధించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో 9 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ఎనిమిందింటిలో విజయం సాధించి ఫైనల్‌కు చేరింది.

PM Modi, cricketers hail India's blind cricket team for T20 WC triumph

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 197 పరుగుల చేసింది. పాక్ బ్యాట్స్‌మెన్లలో బాదర్‌ మునీర్‌ (57) అర్ధసెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో అజయ్‌ కుమార్‌ రెడ్డి, సునీల్‌కు ఒక్కో వికెట్‌ దక్కింది.

అనంతరం 198 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 17.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి పాక్ నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకుంది. భారత్‌ బ్యాట్స్‌మెన్లలో ప్రకాశ్‌ జయరామయ్య (60 బంతుల్లో 15 ఫోర్లతో 99 నాటౌట్‌) అజేయ అర్ధ సెంచరీతో రాణించి భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు.

కాగా, అంధుల టీ20 వరల్డ్ కప్‌లో రెండోసారి ఛాంపియన్‌గా అవతరించిన భారత్‌ను ప్రధాన నరేంద్ర మోడీతో పలువురు అభినందనలు తెలిపారు. టీమిండియా అద్భుత ప్రదర్శనకు దేశ ప్రజలు గర్విస్తున్నారని, భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిస్తున్నానని ప్రధాని తన ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు.

కేంద్ర క్రీడల మంత్రి విజయ్‌ గోయెల్‌ '2016 రియో పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు గొప్ప ప్రదర్శన చేశారు. ఇప్పుడు అంధుల టీ20 ప్రపంచ కప్‌లో భారత రెండోసారి టైటిల్‌ గెలిచి చరిత్ర సృష్టించింద'ని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఇక భారత మాజీ క్రికెటర్ సెహ్వాగ్ తనదైన శైలిలో ట్వీట్ చేశారు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X