సెమీ ఫైనల్ 1: ఇంగ్లాండ్‌ ఆ వెలితిని పూరిస్తుందా?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీఫైనల్‌కు సర్వం సిద్ధమైంది. పరాజయమే ఎరుగకుండా సెమీఫైనల్‌కు దూసుకొచ్చిన జట్టు ఒకటి కాగా, అనూహ్య ఫలితంతో సెమీస్‌కు చేరిన జట్టు మరొకటి. ఇరు జట్లు కలిసి టోర్నీలో టైటిల్‌ వేటకు తొలి అడుగు వేసేందుకు సిద్ధమయ్యాయి.

ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు  | స్కోరు కార్డు

టోర్నీలో భాగంగా బుధవారం జరిగే తొలి సెమీఫైనల్లో ఇంగ్లాండ్-పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. ఏ రకంగా చూసినా... అన్ని రంగాల్లో ఇంగ్లాండ్ జట్టే పటిష్టంగా కనిపిస్తోంది. మరోవైపు 'సంచలనం' అనేది ఒకటుంటుందిగా... అదే మమ్మల్ని గెలిపిస్తుందనే ధైర్యంతో సర్ఫరాజ్‌ సేన బరిలోకి దిగుతోంది.

 

నిజం చెప్పాలంటే పాకిస్థాన్‌కు ఓ గొప్ప అవకాశం. గత కొన్నేళ్లుగా ఐసీసీ టోర్నీల్లో పెద్దగా రాణించని ఆ జట్టుకు ఇదొక సువర్ణావకాశం. చావోరేవో తేల్చే మ్యాచ్‌లో ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో బ్యాటింగ్‌ వైఫల్యమే ఆ జట్టును కలవరపరిచే అంశం.

ఇంగ్లాండ్‌ ఆ వెలితిని పూరిస్తుందా?

ఇంగ్లాండ్‌ ఆ వెలితిని పూరిస్తుందా?

వన్డే క్రికెట్లో ఓ మేజర్‌ ట్రోఫీ లేని వెలితి ఇంగ్లాండ్‌ను గత కొన్నేళ్లుగా వేధిస్తోంది. మూడు సార్లు వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరుకున్నా... గత 42 ఏళ్లలో ఐసీసీ ట్రోఫీని అందుకోలేక పోవడం విశేషం. 2015 వన్డే వరల్డ్ కప్‌లో లీగ్‌ దశలోనే ఇంటి దారి పట్టిన అనంతరం కళ్లు తెరిచిన ఇంగ్లండ్‌ జట్టు ఏడాది తిరిగేలోపే ప్రపంచంలోని మేటి జట్లలో ఒకటిగా తయారైంది.

అద్భుతమైన బ్యాటింగ్‌ లైనప్‌

అద్భుతమైన బ్యాటింగ్‌ లైనప్‌

భీకరమైన బ్యాటింగ్‌ లైనప్‌, అద్భుతమైన బౌలింగ్‌, మంచి ఆల్‌రౌండర్లతో నిండి ఉన్న ఇంగ్లాండ్‌ను సొంతగడ్డపై ఆపడం పాక్‌కు తలకు మించిన భారమే. గ్రూప్‌ దశలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో నెగ్గి సెమీస్‌కు దూసుకొచ్చిన ఇయాన్‌ మోర్గాన్‌ బృందం పాక్‌ను చిత్తు చేయాలనే సంకల్పంతో ఉంది.

ఇంగ్లాండ్‌కు కలిసొచ్చే అంశం ఇదే

ఇంగ్లాండ్‌కు కలిసొచ్చే అంశం ఇదే

మోర్గాన్‌, రూట్‌, స్టోక్స్‌ మంచి ఫామ్‌లో ఉండడం ఇంగ్లాండ్‌కు కలిసొచ్చే అంశం. వ్యక్తిగతంగా చూస్తే బెన్‌ స్టోక్స్‌ ప్రపంచ క్రికెట్‌లోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్‌. బ్యాట్‌తోనైనా, బాల్‌తోనైనా మ్యాచ్‌ స్థితిని ఒంటిచేత్తో మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేయగల సమర్ధుడు. బ్యాటింగ్‌లో అలెక్స్‌ హేల్స్, జో రూట్, జోస్‌ బట్లర్‌లతో కూడిన టాప్‌ ఆర్డర్‌ సూపర్‌ ఫామ్‌లో ఉంది.

నిలకడలేమితో పాకిస్థాన్

నిలకడలేమితో పాకిస్థాన్

ఇక పాకిస్థాన్ విషయానికి వస్తే నిలకడలేమితో సతమతమవుతోంది. ఇంగ్లాండ్ జట్టుతో పోల్చి చూస్తే పాక్‌ ఎంతో దూరంలో ఉంది. బ్యాట్స్‌మెన్‌ ఎప్పుడెలా ఆడతారో... బ్యాటింగ్‌లో ఎందుకలా పెవిలియన్‌కు క్యూకడతారో వారికే తెలియని పరిస్థితి. శ్రీలంకతో జరిగిన గత మ్యాచ్‌లో ఇదే పరిస్థితిని మనం చూశాం. చివర్లో కెప్టెన్ సర్ఫరాజ్ రాణించడంతో గట్టెక్కింది.

సీనియర్లు విఫలం

సీనియర్లు విఫలం

సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ మహ్మద్‌ హఫీజ్‌, షోయబ్‌ మాలిక్‌ విఫలం అవుతుండడం ఆ జట్టును ఇబ్బందుల్లో నెడుతోంది. అయితే శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో జమాన్‌ సత్తా చాటడం జట్టుకు సానుకూలాంశం. కానీ బ్యాటింగ్‌తో పోలిస్తే బౌలింగ్‌లో పాక్‌ బలంగా ఉంది. ఓ అసాధారణ జట్టును ఢీ కొనాలంటే పాకిస్థాన్ జట్టులో అందరూ వందశాతం అంకితభావాన్ని కనబరచాలి.

పిచ్... వాతావరణం

పిచ్... వాతావరణం

ఇక్కడి సోఫియా గార్డెన్స్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం. పాక్, శ్రీలంకల మధ్య జరిగిన పిచ్‌నే తొలి సెమీస్‌కు వినియోగిస్తున్నారు. టోర్నీలో తొలి వారం బాగా ఇబ్బందిపెట్టిన వరుణుడు ఇప్పుడు నెమ్మదించాడు. కార్డిఫ్‌లో బుధవారం వర్షం కురిసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. సెమీస్‌కు వాడుతున్న పిచ్‌పై పరుగుల వర్షం ఖాయంగా కనిపిస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Having swept aside all opposition in the group stage, hosts England are expected to face a strong pace attack when they take on Pakistan in the first semi-final of the Champions Trophy cricket tournament here on Wednesday (June 14).
Please Wait while comments are loading...