న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హైదరాబాద్ Vs ఢిల్లీ: ప్రతీకారం తీర్చుకుంటారా?

ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా బుధవారం సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ సీజన్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్‌ మూడు విజయాలు సాధించింది. 

By Nageshwara Rao

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా బుధవారం సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ సీజన్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్‌ మూడు విజయాలు సాధించింది. అయితే ఈ విజయాలన్నీ సొంతగడ్డపై సాధించినవి కావడం విశేషం. తొలి మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, గుజరాత్‌ లయన్స్‌పై నెగ్గిన సన్‌ రైజర్స్‌ ఆ తర్వాత వేరే వేదికగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది.

అయితే సోమవారం సొంతగడ్డపై కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన ఐదో మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. దీంతో తమకెంతో అచ్చోచ్చిన ఉప్పల్‌ మైదానంలో ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో వార్నర్‌ నేతృత్వంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. మరోవైపు ఈ టోర్నీలో మంచి ఊపు మీదున్న ఢిల్లీ గత మ్యాచ్‌లో కోల్‌కతాపై పోరాడి ఓడింది. దీంతో సన్‌రైజర్స్‌పై విజయం సాధించి తిరిగి గాడిలో పడాలని డేర్‌డెవిల్స్‌ భావిస్తోంది.

హైదరాబాద్‌ మూడు, ఢిల్లీ నాలుగు

హైదరాబాద్‌ మూడు, ఢిల్లీ నాలుగు

ప్రస్తుతం ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో హైదరాబాద్‌ మూడో స్థానంలో ఉండగా, ఢిల్లీ నాలుగు పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌ (డేవిడ్‌ వార్నర్‌, 235), అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ (భువనేశ్వర్‌ కుమార్‌, 15 వికెట్లు) ఇద్దరూ సన్‌రైజర్స్‌ జట్టులో ఉన్నారు. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో గత మ్యాచ్‌లో ఈ ఇద్దరూ అద్భుతంగా ఆడి సన్‌రైజర్స్‌ను గెలిపించారు. సొంతగడ్డపై జరుగుతున్న సమరంలో మరోసారి వీళ్లిద్దరూ విజృంభిస్తే హైదరాబాద్‌కు తిరుగుండదు.

శిఖర్‌ ధావన్, యువరాజ్‌ సింగ్‌ స్థాయికి తగ్గట్టు లేదు

శిఖర్‌ ధావన్, యువరాజ్‌ సింగ్‌ స్థాయికి తగ్గట్టు లేదు

బుధవారం నాటి మ్యాచ్‌లో ఓపెనర్‌ శిఖర్‌ ధావన్, యువరాజ్‌ సింగ్‌ సత్తా చాటాల్సిన అవసరముంది. ఈ సీజన్‌లో వీరిద్దరూ స్థాయికి తగ్గట్టు ఆడట్లేదు. ఒక మ్యాచ్‌లో యువీ రాణించి జట్టును గెలిపించినా.. శిఖర్‌ మాత్రం ఇప్పటిదాకా ప్రభావవంతమైన ఇన్నింగ్స్‌ ఆడలేకపోయాడు. మరోవైపు మోజెస్‌ హెన్రిక్స్, దీపక్‌ హుడా రాణించాల్సిన అవసరముంది. ఇక టోర్నీలో అత్యుత్తమ బౌలింగ్‌ లైనప్‌ కలిగిన జట్లలో సన్‌రైజర్స్‌ ఒకటి. భువనేశ్వర్ కుమార్‌ ఐదు మ్యాచ్‌ల్లోనే 15 వికెట్లతో చెలరేగిన భువనేశ్వర్‌ ‘పర్పుల్‌ క్యాప్‌'ను సొంతం చేసుకున్నాడు.

తుది జట్టులో ఆశిష్‌ నెహ్రా

తుది జట్టులో ఆశిష్‌ నెహ్రా

మరో యువ సంచలనం రషీద్‌ఖాన్‌, మరో అప్ఘనిస్ధాన్ ఆటగాడు మహ్మద్‌ నబీ జట్టుకు గొప్పగా సేవలు అందిస్తున్నారు. బరిందర్‌ శరణ్‌ స్థానంలో ఆశిష్‌ నెహ్రా తుది జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయి. హెన్రిక్స్, సిద్ధార్థ్‌ కౌల్‌ పొదుపుగా బౌలింగ్‌ చేస్తున్నారు. పంజాబ్‌తో మ్యాచ్‌లో క్రమశిక్షణాయుతమైన బౌలింగ్‌తో సన్‌ బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేశారు. మరోవైపు బంగ్లాదేశ్‌ పేసర్‌ ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ బెంచ్‌కే పరిమితమవ్వచ్చు. ఏదేమైన వరుసగా రెండు పరాజయాల తర్వాత విజయాన్ని అందుకున్న సన్‌రైజర్స్‌ అదేజోరును కొనసాగించాలని పట్టుదలతో ఉంది.

బ్యాటింగ్‌లో బలహీనంగా కనిపిస్తోన్న ఢిల్లీ

బ్యాటింగ్‌లో బలహీనంగా కనిపిస్తోన్న ఢిల్లీ

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో ఆఖరివరకు పోరాడి ఆకట్టుకుంది. బ్యాటింగ్‌ కొంచెం బలహీనంగా కన్పిస్తోంది. మరోవైపు ఈ సీజన్‌లో ఢిల్లీ విజయాల్లో ఇద్దరు యువ ఆటగాళ్లు ప్రభావం చూపిస్తున్నారు. ఒకరు సంజూ శాంసన్‌ కాగా మరొకరు రిషబ్‌ పంత్‌. రైజింగ్‌ పుణే సూపర్‌జెయింట్‌పై అద్భుత ఆటతీరుతో సంజూ శాంసన్‌ సెంచరీని నమోదు చేశాడు. అయితే కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్‌ ఓ మోస్తరుగా రాణించారు. శుభారంభం దక్కినప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మలచలేక పోతున్నారు.

ఆకట్టుకుంటున్న శాంసన్, పంత్‌

ఆకట్టుకుంటున్న శాంసన్, పంత్‌

ఈ సీజన్‌లో జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లుగా శాంసన్, పంత్‌లు కొనసాగుతున్నారు. మరోవైపు బౌలింగ్‌ విషయానికొస్తే కోరె అండర్సన్‌, బిల్లింగ్స్‌, క్రిస్‌ మోరిస్‌ జట్టుకు కీలకం. బౌలింగ్‌లో కెప్టెన్‌ జహీర్‌ఖాన్‌, పాట్‌ కమిన్స్‌తో పాటు అండర్సన్‌, మిశ్రా రాణిస్తున్నారు. ఢిల్లీ తరుపున క్రిస్‌ మోరిస్‌ ఎనిమిది వికెట్లతో అత్యధిక వికెట్లు సాధించాడు. కమ్మిన్స్, జహీర్‌ ఏడేసి వికెట్లు తీశారు. అమిత్ మిశ్రా ఐదు వికెట్లు తీశాడు.

జట్ల వివరాలు:

జట్ల వివరాలు:

సన్ రైజర్స్ హైదరాబాద్:

David Warner (captain), Tanmay Agarwal, Ricky Bhui, Bipul Sharma, Ben Cutting, Shikhar Dhawan, Eklavya Dwivedi, Moises Henriques, Deepak Hooda, Chris Jordan, Siddharth Kaul, Bhuvneshwar Kumar, Ben Laughlin, Abhimanyu Mithun, Mohammad Nabi, Mohammed Siraj, Mustafizur Rahman, Ashish Nehra, Naman Ojha (wicketkeeper), Rashid Khan, Vijay Shankar, Barinder Sran, Pravin Tambe, Kane Williamson and Yuvraj Singh.

ఢిల్లీ డేర్ డెవిల్స్:

Zaheer Khan (captain), Mohammad Shami, Shahbaz Nadeem, Jayant Yadav, Amit Mishra, Shreyas Iyer, Sanju Samson, Karun Nair, Rishabh Pant (wicketkeeper), CV Milind, Khaleel Ahmed, Pratyush Singh, Murugan Ashwin, Aditya Tare, Shashank Singh, Ankit Bawane, Navdeep Saini, Corey Anderson, Angelo Mathews, Pat Cummins, Kagiso Rabada, Chris Morris, Carlos Brathwaite, Sam Billings.

మ్యాచ్ ప్రారంభం రాత్రి 8 గంటలకు - LIVE on Sony SIX, Sony Max, Sony ESPN

గురువారం (April 20) మ్యాచ్ - Punjab Vs Mumbai in Indore - 8 PM

హైదరాబాద్ తదుపరి మ్యాచ్ - Vs Pune in Pune on April 22 (Saturday) - 4 PM

ఢిల్లీ తదుపరి మ్యాచ్ - Vs Mumbai in Mumbai on April 22 (Saturday) - 8 PM

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X