పంజాబ్ రాత మారుతుందా?: చెరో తొమ్మిది మ్యాచ్‌లు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా గురువారం ఇండోర్‌లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు తలపడిన 18 మ్యాచ్‌ల్లో ఇరు జట్లు చెరో తొమ్మిది మ్యాచ్‌లు గెలిచి సమంగా ఉన్నాయి. ఇక ఈ సీజన్‌ని విజయంతో ఆరంభించిన పంజాబ్ ఆ తర్వాత ఆశించిన స్ధాయిలో రాణించలేకపోతోంది.

మరోవైపు తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన ముంబై ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని వరుస విజయాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉండగా, పంజాబ్ మాత్రం ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇండోర్‌లోని హోల్కర్‌ స్టేడియంలో ఇరు జట్ల మధ్య పోరు రసవత్తరంగా మారింది.

హోల్కర్‌ స్టేడియంలో ఇదే చివరి మ్యాచ్‌

హోల్కర్‌ స్టేడియంలో ఇదే చివరి మ్యాచ్‌

అంతేకాదు ఈ సీజన్‌లో హోల్కర్‌ స్టేడియంలో జరిగే చివరి మ్యాచ్‌ ఇదే కావడం గమనార్హం. ఈ సీజన్‌లో ఇండోర్ వేదికగా తలపడిన రెండు మ్యాచ్‌ల్లోనూ పంజాబ్‌ విజయం సాధించింది. అయితే వేరే వేదికల్లో జరిగిన మ్యాచ్‌ల్లో పంజాబ్‌ ఏ ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేదు.

హ్యాట్రిక్‌ కోసం ముంబై ఇండియన్స్‌పై

హ్యాట్రిక్‌ కోసం ముంబై ఇండియన్స్‌పై

ఈ నేపథ్యంలో సొంతగడ్డపై ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించి హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసుకోవాలని పంజాబ్‌ ప్రయత్నిస్తోంది. ఇక ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే విజయ పరంపరను కొనసాగించాలని అనుకుంటోంది. ఇండోర్‌లో ఈ రెండు జట్లు తలపడటం ఇదే మొదటి సారి.

పటిష్టంగా పంజాబ్‌ బౌలింగ్‌ లైనప్‌

పటిష్టంగా పంజాబ్‌ బౌలింగ్‌ లైనప్‌

సందీప్ శర్మ, అక్షర్‌ పటేల్‌తో పంజాబ్‌ బౌలింగ్‌ లైనప్‌ బలంగా కనిపిస్తోంది. బౌలింగ్‌కు తోడు బ్యాటింగ్ కూడా కుదురుకుంటే పంజాబ్‌‌ ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ఖాయం. ఇక ముంబై జట్టు విషయానికి వస్తే గురువారం స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

జట్ల వివరాలు:

జట్ల వివరాలు:

కింగ్స్ ఎలెవన్ పంజాబ్:
Glenn Maxwell (captain), David Miller, Manan Vohra, Hashim Amla, Shaun Marsh, Armaan Jaffer, Martin Guptill, Eoin Morgan, Rinku Singh, Sandeep Sharma, Arman Jaffer, Anureet Singh, Mohit Sharma, KC Cariappa, Pradeep Sahu, Swapnil Singh, T Natrajan, Matt Henry, Varun Aaron, Axar Patel, Marcus Stoinis, Gurkeerat Mann, Rahul Tewatia, Darren Sammy, Wriddhiman Saha (wicketkeeper), Nikhil Naik, Ishant Sharma.

ముంబై ఇండియన్స్:
Rohit Sharma (captain), Parthiv Patel (wicketkeeper), Tim Southee, Kieron Pollard, Jos Buttler, Ambati Rayudu, Mitchell McClenaghan, Nitish Rana, Jasprit Bumrah, Hardik Pandya, Krunal Pandya, Harbhajan Singh, Mitchell Johnson, Lendl Simmons, R Vinay Kumar, Saurabh Tiwary, Karn Sharma, Krishnappa Gowtham, Siddhesh Lad, Nicholas Pooran, Shreyas Gopal, Jitesh Sharma, Deepak Punia, Jagadeesha Suchith, Kulwant Khejroliya.

మ్యాచ్ ప్రారంభం - రాత్రి 8 గంటలకు
LIVE on Sony SIX, Sony Max, Sony ESPN

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
On a roll with four consecutive victories, two-time champions Mumbai Indians (MI) would look to continue the winning streak when they take on Kings XI Punjab (KXIP) in an Indian Premier League (IPL) 2017 match, here tomorrow (April 20).
Please Wait while comments are loading...