ఈడెన్‌లో కోల్‌కతాపై లయన్స్ విజయం సాధించేనా?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా శుక్రవారం గుజరాత్ లయన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది. ఈ సీజన్‌లో కోల్ కతా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో విజయం సాధించింది.

ఇక గుజరాత్ లయన్స్ విషయానికి వస్తే ఐదు మ్యాచ్‌లు ఆడగా అందులో నాలుగింటిలో పరాజయం పాలైంది. ఈ సీజన్‌లో గుజరాత్‌ లయన్స్‌ ఎదుర్కొన్న తొలి జట్టు కోల్‌కతానే కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 183 పరుగులు చేసింది.

Preview: IPL 2017: Match 23: Kolkata Vs Gujarat on April 21

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఓపెనర్లు క్రిస్‌లిన్‌ (41 బంతుల్లో 93 నాటౌట్‌; 6 ఫోర్లు, 8 సిక్సులు), గంభీర్‌ (48 బంతుల్లో 76 నాటౌట్‌; 12 ఫోర్లు) చెలరేగడంతో వికెట్‌ కోల్పోకుండా గుజరాత్‌పై కోల్‌కతా విజయం సాధించింది. గాయం నుంచి కోలుకున్న డ్వేన్ బ్రావో శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఆడే విషయమై స్పష్టత లేదు.

మరోవైపు గుజరాత్ లయన్స్ జట్టులో ఆండ్రూ టై అద్భుత ప్రదర్శన చేయడం జట్టుకు కలిసొచ్చే అంశం. ఇదిలా ఉంటే కోల్ కతా మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతోంది. కెప్టెన్ గంభీర్ విఫలమైన తరుణంలో రాబిన్ ఊతప్ప, మనీష్ పాండే, యూసఫ్ పఠాన్‌లలో ఎవరో ఒకరు జట్టుని విజయతీరాలకు చేర్చుతున్నారు.

జట్ల వివరాలు:
కోల్ కతా నైట్ రైడర్స్:
Gautam Gambhir (captain), Darren Bravo, Trent Boult, Piyush Chawla, Nathan Coulter Nile, Colin De Grandhomme, Rishi Dhawan, Sayan Ghosh, Shaikb-Al-Hasan, Sheldon Jackson, Ishank Jaggi, Kuldeep Yadav, Chris Woakes, Chris Lynn, Sunil Narine, Manish Pandey, Yusuf Pathan, Ankit Rajpoot, Suryakumar Yadav, Robin Uthappa (wicketkeeper) and Umesh Yadav.

గుజరాత్ లయన్స్:
Suresh Raina (captain), Akshadeep Nath, Shubham Agarwal, Basil Thampi, Dwayne Bravo, Chirag Suri, James Faulkner, Aaron Finch, Manpreet Gony, Ishan Kishan, Ravindra Jadeja, Shadab Jakati, Dinesh Karthik (wicketkeeper), Dhawal Kulkarni, Shivil Kaushik, Praveen Kumar, Brendon McCullum, Munaf Patel, Pratham Singh, Jason Roy, Pradeep Sangwan, Jaydev Shah, Shelly Shaurya, Nathu Singh, Dwayne Smith, Tejas Baroka and Andrew Tye.

మ్యాచ్ రాత్రి 8 గంటలకు - LIVE on Sony SIX, Sony Max, Sony ESPN

శనివారం (April 22) మ్యాచ్‌లు
Pune Vs Hyderabad in Pune - 4 PM
Mumbai Vs Delhi in Mumbai - 8 PM

కోల్ కతా తదుపరి మ్యాచ్ - Vs Bangalore in Kolkata on April 23 (Sunday) - 8 PM
గుజరాత్ తదుపరి మ్యాచ్ - Vs Punjab in Rajkot on April 23 - 4 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
High on confidence following a hat-trick of victories, two-time champions Kolkata Knight Riders (KKR) would look to continue their winning streak when they face struggling Gujarat Lions (GL) in a battle between the top and bottom-placed teams of the ongoing Indian Premier League (IPL) 2017, here tomorrow (April 21).
Please Wait while comments are loading...