ఐపీఎల్: ఢిల్లీపై పూణె దూకుడు కొనసాగుతుందా? (ఫోటోలు)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా శుక్రవారం రైజింగ్‌ పుణే సూపర్‌జెయింట్‌ శుక్రవారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో తలపడనుంది. వరుసగా నాలుగు విజయాలు సాధించిన పూణె ఈ మ్యాచ్‌లో అదే జోరుని కొనసాగించాలని యోచనలో ఉంది. మరోవైపు గత మ్యాచ్‌లో కోల్‌కతాపై విజయం సాధించిన ఢిల్లీ తన జోరుని కొనసాగించాలని భావిస్తోంది.

గత సీజన్‌లో చెత్త ప్రదర్శన చేసిన పూణె ఈ సీజన్‌లో మాత్రం మంచి ప్రదర్శన చేస్తోంది. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, 4 పరాజయాలు నమోదు చేసింది. ముఖ్యంగా చివరగా ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు నమోదు చేసింది. దీంతో 16 పాయింట్లతో పట్టికలో మూడోస్థానంలో నిలిచింది.

పూణె అద్భుత విజయం

పూణె అద్భుత విజయం

సన్‌రైజర్స్‌తో జరిగిన చివరిమ్యాచ్‌లో బౌలర్లు రాణించడంతో పూణె అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో పూణె బౌలర్ జయదేవ్‌ ఉనాద్కట్‌ ఐదు వికెట్లతో సత్తా చాటాడు. దీంతో ఢిల్లీ మ్యాచ్‌లో ఇదే విధంగా రాణించాలని పూణె భావిస్తోంది. పూణె కెప్టెన్ స్టీవ్ స్మిత్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.

11 మ్యాచ్‌ల్లో 367 పరుగులు

11 మ్యాచ్‌ల్లో 367 పరుగులు

ఇప్పటి వరకు 11 మ్యాచ్‌ల్లో 367 పరుగులతో జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ సీజన్‌లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన యువ క్రికెటర్ రాహుల్‌ త్రిపాఠి కూడా మంచి ప్రదర్శన చేస్తున్నాడు. 10 మ్యాచ్‌ల్లో 353 పరుగులు చేశాడు. పూణె జట్టులో మిగతా ఆటగాళ్లైన స్టోక్స్‌ (283), రహానే (248), ధోని (235) పరుగులు చేశారు.

అంచనాలకు మించి రాణిస్తున్న తాహిర్

అంచనాలకు మించి రాణిస్తున్న తాహిర్

ఈ సీజన్‌లో దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ అంచనాలకు మించి రాణించాడు. మొత్తం 12 మ్యాచ్‌లాడిన తాహిర్‌ 18 వికెట్లతో జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ సీజన్‌లో ఇంతకముందు ఇరుజట్లు పరస్పరం తలపడిన మ్యాచ్‌లో 97 పరుగులతో పుణే ఘన విజయం సాధించింది.

ఢిల్లీ చెత్త ప్రదర్శన

ఢిల్లీ చెత్త ప్రదర్శన

ఇక ఢిల్లీ విషయానికి వస్తే ఈ సీజన్‌లో చెత్త ప్రదర్శన చేస్తోంది. ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లాడిన ఢిల్లీ 5 విజయాలు, 7 పరాజయాలు నమోదు చేసింది. దీంతో 10 పాయింట్లతో పట్టికలో ఆరోస్థానంలో కొనసాగుతోంది. అయితే గుజరాత్‌ లయన్స్‌తో జరిగిన చివరిమ్యాచ్‌లో ఢిల్లీ అద్భుత విజయం సాధించింది.

రాణిస్తున్న శ్రేయస్‌ అయ్యర్‌, సంజూ శాంసన్

రాణిస్తున్న శ్రేయస్‌ అయ్యర్‌, సంజూ శాంసన్

ఢిల్లీ ఆటగాళ్లలో యువ క్రికెటర్లు శ్రేయస్‌ అయ్యర్‌, సంజూ శాంసన్ రాణిస్తున్నారు. ఇప్పటివరకు సంజూ శాంసన్ 12 మ్యాచ్‌ల్లో 384 పరుగులు చేసి జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. మరోవైపు శ్రేయస్‌ అయ్యర్‌ (303 పరుగులు), రిషభ్‌ పంత్‌ (285), కరుణ్‌ నాయర్‌ (191) ఆకట్టుకుంటున్నారు.

తొలి మ్యాచ్‌లో పూణెపై విజయం

తొలి మ్యాచ్‌లో పూణెపై విజయం

ఇక బౌలింగ్‌ విషయానికొస్తే ప్యాట్‌ కమిన్స్‌ రాణిస్తున్నాడు. 10 మ్యాచ్‌ల్లో 12 వికెట్లతో జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. క్రిస్‌ మోరిస్‌ కూడా 12 వికెట్లు తీశాడు. అమిత్‌ మిశ్రా (10), జహీర్‌ ఖాన్‌ (7) వికెట్లు తీశారు. లీగ్‌లో భాగంగా పూణెపై భారీ విజయం సాధించిన ఢిల్లీ మరోసారి అదే తరహా ప్రదర్శన పునరావృతం చేయాలని భావిస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Rising Pune Supergiant (RPS) will aim to secure a play-off spot while Delhi Daredevils (DD) will only have pride to play for when they meet in their Indian Premier League (IPL) 2017 encounter at the Feroz Shah Kotla here on Friday (May 12).
Please Wait while comments are loading...