ప్లేఆఫ్ లక్ష్యంగా సన్‌రైజర్స్: గుజరాత్‌పై మంచి రికార్డు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో భాగంగా శనివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, గుజరాత్‌ లయన్స్‌తో తలపడనుంది. ప్లే ఆఫ్ బెర్తె లక్ష్యంగా ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ బరిలోకి దిగుతుంది. ముంబై ఇండియన్స్‌పై చివరి మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన సన్‌రైజర్స్‌ మరోసారి అలాంటి ప్రదర్శనే పునరావృతం చేయాలనే ఆలోచనలో ఉంది.

ఐపీఎల్ పదో సీజన్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అద్బుత ప్రదర్శన చేస్తోంది. ముఖ్యంగా సన్ రైజర్స్ సొంతగడ్డపై అద్భుత విజయాలను నమోదు చేసింది. సన్ రైజర్స్ గెలిచిన ఏడు విజయాల్లో ఆరు సొంతగడ్డ హైదరాబాద్‌లో సాధించినవే కావడం విశేషం.

ఇలా ఈ సీజన్‌లో ఇప్పటివరకు సన్ రైజర్స్ ఆడిన 13 మ్యాచ్‌ల్లో ఏడింట విజయం సాధించగా, ఐదింట పరాజయం పాలైంది. చిన్నస్వామి స్టేడియంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఫలితం రాలేదు. దీంతో 15 పాయింట్లతో పట్టికలో నాలుగోస్థానంలో కొనసాగుతోంది.

దీంతో ప్లే ఆఫ్‌కు చేరుకోవాలంటే శనివారం జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్‌ తప్పనిసరిగా విజయం సాధించాల్సి ఉంటుంది. లేకపోతే ఆదివారం రైజింగ్ పూణె సూపర్ జెయింట్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌పై పుణే విజయం సాధిస్తే నాలుగో జట్టుగా ప్లే ఆఫ్‌కు సన్‌రైజర్స్‌ అర్హత సాధిస్తుంది.

గుజరాత్‌పై విజయం సాధించి ప్లే ఆఫ్‌కు

గుజరాత్‌పై విజయం సాధించి ప్లే ఆఫ్‌కు

ఈ నేపథ్యంలో నాకౌట్‌ బెర్త్‌ కోసం అంతవరకు వేచి చూడకుండా గుజరాత్‌పై విజయం సాధించి ప్లే ఆఫ్‌కు చేరుకోవాలని వార్నర్ సేన భావిస్తోంది. ఐపీఎల్ పదో సీజన్‌లో సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లాడిన వార్నర్‌ 535 పరుగులతో టోర్నీలోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

అత్యుత్తమ బౌలింగ్ కలిగి ఉన్న సన్ రైజర్స్

అత్యుత్తమ బౌలింగ్ కలిగి ఉన్న సన్ రైజర్స్

దీంతో ‘ఆరెంజ్‌ క్యాప్‌'ను కైవసం చేసుకున్నాడు. మరోవైపు శిఖర్‌ ధావన్‌ (450 పరుగులు) అద్భుతంగా రాణిస్తున్నాడు. మోజెస్‌ హెన్రిక్స్‌ (273 పరుగులు), యువరాజ్‌ సింగ్‌ (243), కేన్‌ విలియమ్సన్‌ (232) ఆకట్టుకుంటున్నారు. ఇక ఐపీఎల్‌లో అత్యుత్తమ బౌలింగ్ కలిగి ఉన్న జట్లలో సన్ రైజర్స్ ఒకటి.

సత్తా చాటుతున్న పేసర్ భువనేశ్వర్ కుమార్

సత్తా చాటుతున్న పేసర్ భువనేశ్వర్ కుమార్

పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ సత్తా చాటుతున్నాడు. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లాడిన భువనేశ్వర్ కుమార్ 14 సగటుతో 23 వికెట్లను కైవసం చేసుకుని టోర్నీలోనే అత్యధిక వికెట్లను తీసిన బౌలర్‌గా నిలిచాడు. దీంతో ‘పర్పుల్‌ క్యాప్‌'ను సొంతం చేసుకున్నాడు. ఇతనికి తోడుగా సిద్దార్థ్‌ కౌల్‌ (15 వికెట్లు), అఫ్గాన్‌ సంచలనం రషీద్‌ ఖాన్‌ (14) అదరగొడుతున్నాడు.

ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్న సన్ రైజర్స్

ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్న సన్ రైజర్స్

శనివారం నాటి మ్యాచ్‌లో సన్ రైజర్స్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది. ఐపీఎల్‌ చరిత్రలో గుజరాత్‌ లయన్స్‌ చేతిలో ఒక్కసారీ హైదరాబాద్‌ ఓడిపోలేదు. గత సీజన్‌లో రెండుసార్లు, ఈ సీజన్‌లో ఓ సారి గుజరాత్‌పై వార్నర్‌సేన విజయం సాధించింది. ఈ మూడుసార్లు ఛేదనలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్‌ విజయం సాధించింది.

పెద్దగా రాణించని గుజరాత్ లయన్స్

పెద్దగా రాణించని గుజరాత్ లయన్స్

ఇక గత సీజన్‌లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన గుజరాత్ లయన్స్ అద్భుత ప్రదర్శన చేసి మూడోస్థానంలో నిలిచింది. అయితే ఈ ఏడాది గుజరాత్‌ పెద్దగా రాణించలేకపోయింది. ముఖ్యంగా బౌలింగ్‌ వైఫల్యంతో చాలా ఓటములను మూటగట్టుకుంది. ఈ సీజన్‌లో 13 మ్యాచ్‌లాడిన గుజరాత్‌ నాలుగు విజయాలు, తొమ్మిది పరాజయాలు నమోదు చేసింది.

8 పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో

8 పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో

దీంతో 8 పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్‌లో పుణే, గుజరాత్‌లకు స్థానం లేదు కాబట్టి, సాంకేతికంగా లయన్స్‌ ఆడుతున్న చివరి మ్యాచ్‌గా దీనిని భావించవచ్చు. దీంతో చివరి మ్యాచ్‌లో విజయం సాధించి టోర్నీ నుంచి గౌరవంగా తప్పుకోవాలని గుజరాత్‌ భావిస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sunrisers Hyderabad (SRH) will aim to go for the kill and cement their place in the top four when they face Gujarat Lions (GL) in their last league tie of the Indian Premier League (IPL) 2017 here on Saturday (May 13).
Please Wait while comments are loading...